హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నీతిఆయోగ్‌’ రాజకీయమంటూ హరీశ్: అప్పులు చేసి కేంద్రాన్ని బద్నాం చేస్తారా?: కిషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నీతి ఆయోగ్ కు రాజకీయ రంగు పులుముకుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపించగా.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంపై హరీశ్ రావు విమర్శలు చేయగా, రాష్ట్ర సర్కారుపై ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి.

నీతిఆయోగ్‌కు రాజకీయ రంగు పులుముకుందంటూ హరీశ్

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. బీజేపీకి వంతపాడుతూ నీతిఆయోగ్‌ నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. నీతిఆయోగ్​ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తూ.. శనివారం సీఎం కేసీఆర్​ చేసిన ఆరోపణలపై సర్వత్రా దుమారం చెలరేగింది. సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నీతిఆయోగ్​ నోట్​ విడుదల చేయటం మరింత చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నీతిఆయోగ్​ విడుదల చేసిన నోట్‌​పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని నీతిఆయోగ్ ​పై మంత్రి ధ్వజమెత్తారు. ఆ సంస్థ అంకెలా గారడీ చేస్తూ.. వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

నీతిఆయోగ్ తప్పుడు ప్రకటన.. రూపాయి ఇవ్వలేదు: హరీశ్


నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్‌ తప్పుడు ప్రకటన చేసిందన్నారు హరీశ్ రావు. ఆ సంస్థ చెప్పినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను మోడీ ప్రభుత్వం అమలు చేయలేదన్న హరీశ్ రావు.. దానిపై నీతిఆయోగ్​ ఎందుకు ప్రశ్నించదన్నారు. నీతి అయోగ్‌ ప్రకటన సత్యదూరమని ఆరోపించిన మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్‌ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదన్నారు. నీతిఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందని ఆరోపించారు. కేంద్రం సెస్‌లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ధ్వజమెత్తారు. సెస్‌ల ద్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని, అందులో రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు రావాలన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

కేసీఆర్ సర్కారుకు గుణపాఠం తప్పదంటూ కిషన్ రెడ్డి

కేసీఆర్ సర్కారుకు గుణపాఠం తప్పదంటూ కిషన్ రెడ్డి


నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరవడం, మంత్రి హరీశ్ రావు విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణకు మంచిది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌ పాలనపై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్న కేంద్రమంత్రి .. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటం చూసి.. సీఎం కేసీఆర్‌​కు భయం పట్టుకుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అభద్రతా భావంతోనే వ్యవస్థలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఎద్దేవా చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదంటూ కిషన్ రెడ్డి

కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదంటూ కిషన్ రెడ్డి


నీతిఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లకపోవటం సరైన నిర్ణయం కాదన్నారు కిషన్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు, సమాఖ్య స్ఫూర్తికి మంచిది కాదన్నారు. దేశానికి, రాష్ట్రానికి అవసరమైన అంశాలపై చర్చించేందుకు నీతిఆయోగ్‌ అత్యున్నత వేదిక అని తెలిపారు. రాజకీయ దురుద్ధేశాలతో రాజ్యాంగ సంస్థలను తప్పుపట్టకూడదని హితవు పలికారు. కేసీఆర్‌కు ప్రధానిని కలవటం ఇష్టం లేకపోతే వెళ్లకుండా ఉండొచ్చు. కానీ.. నీతి ఆయోగ్‌ను తప్పుపట్టడం సరికాదన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిన తర్వాత తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందేమోనని ఆవేదన, అభద్రత భావంతో.. ప్రధాని మోడీ, బీజేపీపైనా విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాటు చేసి.. కేంద్రాన్ని బద్నాం చేయడం సరికాదన్నారు. మరోవైపు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలని చెప్పారు.

English summary
KCR absent to Niti Aayog meeting: Kishan Reddy Vs Harish Rao comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X