కేసీఆర్ సంక్రాంతి కానుక: టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్, 10 నాటికి షెడ్యూల్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుకగా బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రానున్న రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. కౌన్సెల్లింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.

ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదివారంనాడు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు.. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై ఈ మేరకు వెల్లడించారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాల హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపాయి. బదిలీలు, ప్రమోషన్ల కోసం చాలా నెలలుగా టీచర్లు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications