హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఉన్నారా?: అదే కారణమంటూ యువ వైద్యురాలి హత్యపై రేవంత్ రెడ్డి, బాధితురాలి ఇంటికి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు సానుభతి, పరామర్శలు వద్దు.. న్యాయం కావాలంటూ మృతురాలి నివాసం ఎదుట ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపడతున్నారు.

 సీఎం కేసీఆర్ ఎక్కడ?: గేటుకు తాళం, మహిళా వైద్యురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత, నేతల అడ్డగింత సీఎం కేసీఆర్ ఎక్కడ?: గేటుకు తాళం, మహిళా వైద్యురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత, నేతల అడ్డగింత

రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు..

రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు..

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, పోలీసులు ఆయన్ను గేటు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అదే కారణమంటూ రేవంత్..

అదే కారణమంటూ రేవంత్..


యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనన బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యురాలి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ అత్యాచార ఘటనకు నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్ ఉన్నారా?

సీఎం కేసీఆర్ ఉన్నారా?

బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు లేదా? అని ప్రశ్నించారు.
ఇంత దారుణమైన ఘటన జరిగినా సీఎం కేసీఆర్ స్పందించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మనిషన్న ప్రతి వ్యక్తి మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, వైద్యురాలి హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసింది. వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్.

సీఎం కేసీఆర్‌పై మహిళల ఆగ్రహం..

సీఎం కేసీఆర్‌పై మహిళల ఆగ్రహం..

కాగా, మృతురాలి నివాసం వద్ద పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్నారు. నిందితులను తక్షణమే ఉరితీయాలని లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఘోరం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల నుంచి ఎందుకు బయటకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళల భద్రతకు మేమున్నాం అనే భద్రతను ఇవ్వలేరా? అని నిలదీస్తున్నారు. ఒక ఆడపిల్లకు ఇంటి ఘోరం జరిగితే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని కార్యాలయం కూడా స్పందించకపోవడం విచారకరమని అన్నారు.

English summary
KCR is there?: Revanth Reddy response on Woman Doctor rap and murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X