హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు వీరాభిమాని: తన మద్దతుదారంటూ జిందం సత్తమ్మపై కేటీఆర్ స్పెషల్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఓ మహిళను ట్విట్టర్ వేదికగా పరిచయం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈమె వీరాభిమాని అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేగాక, తనకు గట్టి మద్దతుదారు అంటూ జిందం సత్తమ్మ అనే మహిళను ప్రపంచానికి పరిచయం చేస్తూ పలు ఫొటోలు పోస్టు చేశారు.

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన సత్తమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హార్డ్‌కోర్ అభిమాని అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక భాగస్వామని, సిరిసిల్ల నియోజకవర్గంలో తనకు గట్టి మద్దతుదారు కూడా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KCRs Big Fan: KTR tweets about Jindam Sattamma.

అంతేగాక, సత్తమ్మతో ఉద్యమ సమయంలో, మంత్రిగా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీంతో కేటీఆర్‌కు మద్దతుగా పలువురు కేసీఆర్, టీఆర్ఎస్ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. సామాన్య కార్తకర్తలను కూడా కేటీఆర్ అక్కున చేర్చుకుంటారని చెబుతున్నారు.

రాష్ట్రపతి పోలింగ్: ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్

శాసనసభ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ మొదటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జులై 21న ఫలితాలను వెల్లడిస్తారు.

ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓటు విలువ 132 కాగా, మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708. కాగా, ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిల్చిన విషయం తెలిసిందే. అయితే, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మాత్రం యశ్వంత్ సిన్హాకే మద్దతు పలికింది.

English summary
KCR's Big Fan: KTR tweets about Jindam Sattamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X