ఏపీలో కేసీఆర్ పర్యటన..! ఫెడరల్ ఫ్రంట్ లోకి జగన్ కు ఆహ్వానం..!!
హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం మూడో ప్రత్యామ్నాయం ఆవశ్యకత ఉందని, అందకోసం తనతో కలిసి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపుకు జాతీయ నేతలు స్పందించిన విషయం తెలిసిందే..! తాజాగా ప్రాంతీయ పార్టీల మద్దత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న చంద్రశేఖర్ రావు ముందుగా ఏపీ లో ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని సంప్రదించబోతున్నారు. అందుకోసం వచ్చేనెలలో ఏపిలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఐతే ఏపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పలు సందర్బాల్లో విమర్శించే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన ఎలా సాగుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.

గుణాత్మక మార్పు రావాలి..! ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలంటున్న కేసీఆర్..!!
గులాబీ అధినేత చంద్రశేఖర్ రావు, దేశ రాజకీయ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తర భారత దేశ ముఖ్యమంత్రులతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముమ్మరంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ త్��రలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పయనం కానున్నట్టు తెలుస్తోంది. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుతాన్ని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

జగన్ తో కేటీఆర్ భేటీ..! త్వరలో కేసీఆర్ ఏపి పర్యటన..!!
తాజాగా ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తో కేటీఆర్ భేటీ కావటం, ఎన్నో విషయా���ు చర్చకు రావటం ద్వారా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశంలో జగన్ కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న అనుమానాలకు తెరదించుతూ జగన్- కేటీఆర్ భేటీ జరిగిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

జగన్ తో కేసీఆర్ భేటీ..! సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..!!
ఇక కేసీఆర్ కూడా అమరావతి ప్రయాణానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. ఈనెల చివరివారం లేదా వచ్చే నెల మొదటివారంలో అమరావతికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వైసీపీ పార్టీని ఫెడరల్ ఫ్రెంట్‌లోకి ఆహ్వానించనున్నారట కేసీఆర్. లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ భేటీలో ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖరాస్తే బాగుంటుందని జగన్ కోరినట్టు కూడా తెలుస్తోంది.

ప్రత్యేకహోదా కోసం కేంద్రానికి లేఖ రాయండి..! కేసీఆర్ కు జగన్ సూచన..!!
అయితే ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతూనే తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుదామని కేటీఆర్ చెప్పారు. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన అన్నారు. ఇక జగన్ తో మరిన్ని చర్చలు జరిపేందుకు స్వయంగా అమరావతికి వచ్చి కలుస్తానని జగన్‌కు కేసీఆర్ చెప్పారని సమాచ��రం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం ఇది సంచలనంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జగన్ తో కేసీఆర్ సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications