హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల పార్ధివదేహం.. ఉదయం గుంటూరుకు,
ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు పోస్ట్ మార్టమ్ నిర్వహించింది.అనంతరం ఆయన పార్ధీవాదేహాన్ని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకువచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలు,నాయకులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బాలక్రిష్ణ నివాళులు అర్పించారు. కాగా ఉదయం వరకు ఆయన పార్ధీవ దేహాన్ని ఎన్టీఆర్ భవన్‌లోనే కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు.
కాగా అమరావతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రి 9గంటలకు వరకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకుని కోడెల మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. కాగ ఉదయం ఎనిమిది గంటలకు కోడెల పార్ధీవ దేహాన్ని గుంటూరు పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గం ద్వార తరలించనున్నారు.

కోడెలతో పార్ధీవ దేహంతోపాటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వెళ్లనున్నట్టు సమాచారం.కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఉంచి అనంతరం నరసరావుపేటకు తరలించనున్నారు. కుటుంభ సభ్యులతో మాట్లాడి బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలనే యోచనలో పార్టీ శ్రేణులు ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications