హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: ఒక ఎకరానికి రూ.50కోట్లు -కోకాపేట భూముల వేలంలో కాసుల పంట -సర్కారువారి పాటకు రెట్టింపు ధర

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముతోన్న తెలంగాణ సర్కారుకు కాసుల పంట పండుతోంది. కోర్టు తీర్పు అనంతరం హైడ్రామా నడుమ హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతానికి చెందిన భూముల్ని వేలం వేయగా, సర్కారువారి పాటకు రెట్టింపు ధరకు స్థలం అమ్ముడుపోయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కోకాపేట భూములకు గురువారం ఈ-ఆక్షన్ నిర్వహించారు.

సీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలాసీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలా

ఒక ఎకరానికి రూ.50 కోట్లు

ఒక ఎకరానికి రూ.50 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించగా సర్కారుకు కాసుల పంట పండింది. ఎకరా భూమికి ప్రాధమిక ధరను ప్రభుత్వం రూ.25కోట్లుగా నిర్ధారించగా, కోకాపేటలో ఏకంగా ఎకరం రూ.50కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏకు చెందిన 49.2 ఎకరాల్లో 8 ప్లాట్లుకు జరిగిన ఈ-వేలంలో 60 మంది బిడ్డర్స్‌ పాల్గొన్నారు. 1, 2, 3, 12 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.

టార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివేటార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివే

నియోపొలిస్ వెంచర్‌గా

నియోపొలిస్ వెంచర్‌గా

కోకాపేటలోని 49.2 ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 8 ప్లాట్ల వెంచర్ కు నియోపొలిస్‌ పేరు పెట్టారు. అవుటర్‌ పక్కనే ఈ వెంచర్‌ ఉంది. ఫైనాన్షియల్‌ జిల్లా నుంచి కోకాపేటకు రావాడానికి అడ్డంగా ఉన్న ఇంటర్‌ ఛేంజ్‌ ట్రాఫిక్‌ సమస్యలను తీర్చుతూ ప్రత్యేకంగా ట్రంపెట్‌ నిర్మిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు వైపు నుంచి అవుటర్‌ మీదుగా నేరుగా నియోపోలిస్‌ లేఅవుట్‌లోకి రావచ్చు. దీనికి రూ.82 కోట్లను వ్యయం చేస్తున్నారు. దీంతో ఈ నియోపోలిస్‌కు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది.

ఖానామెట్‌లో మరో 15 ఎకరాలు

ఖానామెట్‌లో మరో 15 ఎకరాలు


ఇవాళ కోకాపేటలోని భూముల్ని అమ్మేసిన ప్రభుత్వం, రేపు(శుక్రవారం) ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. ఈ వెంచర్‌కు గోల్డెన్‌ మైల్‌ అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ దగ్గరుండి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపాలని బీజేపీ నేత విజయశాంతి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో వేలానికి మార్గం సుగమం అయింది.

English summary
The mega e-auctioning of eight prime plots in Kokapet, in Hyderabad suburbs ends amidst tight police bandobast on Thursday at the HMDA head office in Ameerpet. it is learned that about 60 bidders, including international firms participated in auction and bidders auctioned one acre land for Rs. 50 crore. initially govt starts base price of Rs 25 crore per acre but sold for double prize. HMDA auction 49.92 acres of land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X