hyderabad: ఆత్మహత్యకు యత్నించిన గర్భణి.. కాపాడిన లేక్ పోలీసులు..
ఓ వ్యక్తి చేతిలో మోసపోయి గర్భం దాల్చిన ఓ మహిళ ఆదివారం మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సాగర్ లోకి దూకేలోపే గమనించిన లేక్ పోలీసు ఆమెను కాపాడారు. రాజశేఖర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానన్న నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. తాను గర్భం దాల్చినట్లు చెప్పిన మహిళా రాజశేఖర్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడాని తెలిపింది.
రాజశేఖర్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. రాజశేఖర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. రాజశేఖర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. అరస్ట్ కూడా చేశారని వివరించింది. కానీ రాజశేఖర్ కొద్ది రోజులకే బెయిల్ బయటకు వచ్చాడని తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంకు చెందిన బత్తుల రాజు నెలటూరి ఝాన్సీరాణి ప్రేమించుకున్నారు. వారిద్దరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి కూతురు కూడా జన్మంచింది. అయితే కొద్ది రోజులు ఝాన్సీరాణిని రాజు దూరం పెడుతున్నాడు. పెళ్లి చేసుకోకుండానే తనను తల్లిని చేసిన ప్రియుడు ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది.
మరో మహిళతో వివాహానికి సిద్దమవడంతో న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటూ రాజు ఇంటి ముందు ఆందోళ చేపట్టింది. ఇరుకుపాలెం లోని ఎస్సీ కాలనీలో ప్రియుడు రాజు ఇంటిముందు కూర్చుని మౌన దీక్ష చేపట్టింది ఝాన్సీ. తనకు న్యాయం జరిగేవరకు ఈ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది.
అమ్మాయిలు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరిని నమ్మోద్దని కోరుతున్నారు. తమకు ఎలాంటి ఆపద వచ్చినా పోలీసులకు తెలిపాలని సూచించారు. మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా భద్రతకు షీ టీములు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎవరైనా వేధిస్తే వెంటనే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications