Crime: ఐపీఎల్ బెట్టింగ్ ముఠాలు అరెస్ట్.. నిందితుల నుంచి రూ.3.5 లక్షలు స్వాధీనం..
పోలీసులు ఎంత నిఘా పెట్టిన ఎక్కడో ఓ చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురం, సరూర్‌నగర్‌లో రెండు వేర్వేరు ఐపిఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సభ్యుల ముఠాను ఎల్‌బి నగర్ జోన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటి) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.5 లక్షలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కమలా నగర్‌కు చెందిన నీలపాల నరేష్ యాదవ్ (38), గౌతంనగర్ వాసి అవనగంటి అంజయ్య (33)గా గుర్తించారు.గురువారం పోలీసులకు పక్కా సమాచారం అందడంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు నీలపాల నరేష్, అవనగంటి అంజయ్య కలిసి క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారు. ప్రధాన బుకీ సచిన్ దిలీప్ దలియా.. బెట్టింగ్ మొత్తాన్ని పర్యవేక్షించడానికి 'world7.com' వెబ్‌సైట్‌కు లాగిన్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను నిందితులకు ఇచ్చాడు.

మరో కేసులో షైనజ్‌గంజ్‌లో నివాసం ఉంటున్న శైలేందర్ అగర్వాల్ (36), సరూర్‌నగర్‌లో నివాసముంటున్న ఉగ్గి శ్రీధర్ (38), సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన కనుకు గణేష్ (33) ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతూ దొరికిపోయారు. శైలేందర్ ప్రధాన బుకీ అని, ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్‌లు చేసేవాడని పోలీసులు తెలిపారు. డబ్బు సరిపోకపోవడంతో ఇంట్లోనే బెట్టింగ్ టీం నిర్వహించి డబ్బు సంపాదించేందుకు సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాడని తెలిపారు. .
నిందితుల నుంచి రూ.2,00,000, మూడు మొబైల్ ఫోన్లు, మూడు చిట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరిపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు 3, 4 (సాధారణ గేమింగ్ హౌస్‌ను నిర్వహించడం చట్టవిరుద్ధం) కింద కేసు నమోదు చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ లే కాదు.. నకిలీ ఐపీఎల్ టికెట్లు కూడా తయారు చేసిన నిందితులను గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications