విషాదం: పిడుగుపాటుకు ఓ వ్యక్తితోపాటు 40 గొర్రెలు మృతి

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ మండలంలో పిడుగుపాటుతో ఓ గొర్రెల కాపరితోపాటు 40 గొర్రెలు మృతి చెందాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ మండలంలో పిడుగుపాటుతో ఓ గొర్రెల కాపరితోపాటు 40 గొర్రెలు మృతి చెందాయి.

చింతలతాండాకు చెందిన సైదానాయక్ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం ఉదయం కూడా గొర్రెలను తీసుకుని అడవికి వెళ్లాడు. వర్షం కురవడంతో సైదానాయక్ తోపాటు గొర్రెలు కూడా ఓ పెద్ద చెట్టు కిందికి వచ్చాయి. అదే సమయంలో పిడుగుపడటంతో సైదానాయక్, అతడితోపాటు 40 గొర్రెలు మరణించాయి. అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

 Lightning in Telangana state claims life of man, leaves 40 goats dead.

వర్షం పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బయటికి వెళ్లిన సమయంలో వర్షంలో చెట్ల కిందికి వెళ్లకూడదు. లోహాలకు, జలాశయాలకు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో నేడూ భారీ వర్షాలు

హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, శుక్రవారం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మార్చి 19 వరకు భారత వాతవరణ శాఖ హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Lightning in Telangana state claims life of man, leaves 40 goats dead

హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్లు.. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మార్చి 17న మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములుమెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18, 19 తేదీల్లో కూడా ఇదే వాతావరణం ఉండనుందని పేర్కొంది.

హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సీయస్ కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని అన్ని సర్కిళ్లలోనూ గరిష్ణ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+