హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాట వినకుంటే నష్టపోతారు.. రైతులకు కేటీఆర్ సజెషన్

|
Google Oneindia TeluguNews

వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం కాకరేపుతోంది. ఈ అంశమే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ధాన్యం కొంటారో లేదో కేంద్రం తేల్చి చెప్పాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. తెలంగాణ ధనం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ధాన్యం తీసుకోదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటలు విని రైతులు మోసపోవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ చేసే ప్రకటనను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమన్న కేంద్రం.. తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వానాకాలం పంటను మొత్తం కొనుగోలు చేస్తామని, తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

 listen cm kcr words, minister ktr

రాష్ట్రంలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో 52 వేల మెట్రిక్‌ టన్నులు కొన్నామని, ఇంకా మూడు లక్షల టన్నుల పంట కొనాల్సి వస్తుందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని, యాసంగిలో ధాన్యం కొనబోమన్న నిర్ణయంపై పునః సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నాకు కూర్చోబోతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ ధర్నాలో కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామని చెప్పారు. స్థానిక బీజేపీ అసత్య ప్రచారాన్ని నమ్మి వరి సాగు చేస్తే రైతులు నష్టపోతారని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పినట్టు నడచుకోవాలని ఆయన హితవు పలికారు. వరి కాక.. ఇతర పంటలు వేసి, లాభాలను గడించాలని సూచించారు.

English summary
listen cm kcr words. telangana minister ktr asks to farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X