హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

25 వేల కేసులు నమోదు.. లాక్‌డౌన్ ఉల్లంఘనలే: రాచకొండ సీపీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ అమలవుతోంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. ఈ క్రమంలో కొందరు యదేచ్చగా బయటకు వస్తున్నారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. అయితే అధికంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసులు ఫైల్ చేశారు. ఆ వివరాలను సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు.

మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసింద. ప్రజల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని మహేష్ భగవత్ తెలిపారు. అయినప్పటికీ కొందరు తీరు మారలేదు. ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు 25,537 లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.

lockdown cases are 25 thousand are filed: rachakonda cp

1200 సామాజిక దూరం పాటించని వారిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై 245 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశామని వివరించారు. నిన్న ఒక్క రోజే 1579 వాహనాలను రాచకొండ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. అలాగే లాక్‌డౌన్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లగించిన 15 వేలు కేసులు నమోదు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు.

లాక్ డౌన్ వేళ అందరూ సహకరించాలని.. నిర్దీత సమయంలోనే పనులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అత్యవసరం ఉండి బయటకు వస్తే.. ఎందుకు వచ్చామో తగిన కారణం తెలియజేయాలని కోరారు. లేదంటే కేసులు కడతామని మరోసారి హెచ్చరించారు. నిర్దాక్ష్యిణంగా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

English summary
lockdown cases are 25 thousand are filed rachakonda cp mahesh bhagavath said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X