TCS: టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు.. వెంటనే స్పందించిన పోలీసులు..!
హైదరాబాద్ మాదాపూర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కంపెనీలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. సీఎస్‌కు చేరుకున్న పోలీసులు.. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని నిర్ధారించారు.
కొద్దిసేపటి తర్వాత బాంబు బెదిరింపు కాల్ ఎవరు చేశారో పోలీసులు గుర్తించారు. అతను టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పని చేసి మానేసి ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడు బాంబు ఉందని పోన్ చేసి చెప్పిన గంటల్లోనే మళ్లీ ఫోన్ చేసి బాంబు లేదని చెప్పాడు. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకోవడానికి గాలింపు చేపట్టినట్లు చెప్పారు.

ఆఫీస్ బాంబు ఉందని కాల్ రావడంతో ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యారు. కాగా టీసీఎస్ (TCS) ఉద్యోగులకు కంపెనీ నలుగు రోజుల క్రితం తీపికబురు అందించింది. వేతన అసమానతలు తగ్గించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ తెలిపింది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఆపై వారి వేతనాలు రెట్టింపు అవుతాయని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లకాడ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వ్యాపారంతో పాటు ఉద్యోగుల అభిమానం చూరగొనడంలోనూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుంది. మంచి భవిష్యత్, పని చేసేందుకు మన దేశంలో అత్యుత్తమ కంపెనీ ఏదంటే.. ముమ్మాటికీ టీసీఎస్ అని ఉద్యోగులు తేల్చిచెప్పారు. లింక్డ్‌ఇన్ తాజాగా విడుదల చేసిన '2023 టాప్ కంపెనీస్ ఇండియా' జాబితాలో టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications