హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు, పరువు నష్టం దావా కేసులో

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమన్లు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో కోర్టు సమన్లు ఇష్యూ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ పదవీని రూ.40 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో మాణిక్కం ఠాకూర్ కౌశిక్ రెడ్డిపై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

 వారెంట్ జారీచేస్తాం..

వారెంట్ జారీచేస్తాం..

పిటిషన్ విచారణకు స్వీకరించింది. పాడి కౌశిక్ రెడ్డి తరపున ఎవరూ హాజరు కాకుంటే వారెంట్ జారీ చేస్తామని వెల్లడించింది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌ చేసేందుకు రూ.40 కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ఈ మేరకు పిటిషన్ వేశారు.

 ప్రతిష్టకు భంగం

ప్రతిష్టకు భంగం


ఆ తర్వాత ట్విట్ట‌ర్ వేదిక‌గా రిప్లై కూడా చేశారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై ప‌రువు న‌ష్టం దావా వేస్తున్నానని అప్పుడే చెప్పారు. మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కోర్టు సమన్లు జారీచేసింది. సీఎం కేసీఆర్‌కు విధేయులైన వారు త‌న‌పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారని మాణికం ఠాగూర్ గతంలో అన్నారు.

కాంగ్రెస్‌లో ఉండి..

కాంగ్రెస్‌లో ఉండి..


కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఇచ్చారు. ఆ తర్వాత ఈటల పార్టీ మారడంతో.. హుజురాబాద్‌లో ఉన్న నేతలను గులాబీ పార్టీ ఆకర్షించింది. అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

పోటీ చేయలే.. కానీ

పోటీ చేయలే.. కానీ


ఈటల రాజీనామాతో వచ్చిన బై పోల్‌లో కౌశిక్ రెడ్డి పోటీ చేయలేదు. కానీ ఇచ్చిన మాట మేరకు ఆయనను ఎమ్మెల్సీని చేశారు. అంతకుముందు గవర్నర్ తమిళి సై కూడా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు అంగీకరించలేదు. దీంతో కేసీఆర్- తమిళి సై మధ్య దూరం పెరిగింది. అదీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక అంశంపై గొడవ జరుగుతూనే ఉంటుంది. పదే పదే ఢిల్లీకి వెళ్తూ.. హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతుంటారు.

English summary
madurai court is issue summons to padi kaushik reddy on manikam tagore defamation case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X