హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాత్ముడు విశ్వమానవుడు: అహిసంతోనే విజయం, వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఎందరో మహానీయుల త్యాగంతో స్వాతంత్ర్యం సిద్దించిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అహింసతో విజ‌యం సాధించొచ్చ‌ని ప్ర‌పంచానికి మహాత్మాగాంధీ చాటారారని తెలిపారు. త్యాగాలతో స్వాతంత్య్రం సిద్దించిందని తెలిపారు.గాంధీ గురించి ఈనాటి పిల్ల‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఇవాళ్టి వరకు పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌డ‌టం లేదని కేసీఆర్ అన్నారు. కొందరిలో ఇంకా అసహనం ఉందన్నారు. తమ‌కు ఇంకా స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌ని ఆవేద‌న క‌నిపిస్తోందని తెలిపారు. వాటిని విస్మ‌రించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని తెలిపారు.

ప్ర‌కృతి సంప‌ద‌, ఖ‌నిజ సంప‌ద‌, యువశ‌క్తి, మాన‌వ‌సంప‌త్తితో ఉన్న ఈ దేశం ఎందుకు డెవలప్ కావడం లేదన్నారు. స్వాతంత్య్ర ఉద్య‌మ స్ఫూర్తితో ఉజ్వ‌ల‌మైన రీతిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త అంద‌రిపై ఉందన్నారు. సామూహిక జాతీయ గీతాలాప‌నలో కోటి మంది పాల్గొన్నారని గుర్తుచేశారు. మ‌హాత్మ గాంధీ విశ్వ‌మాన‌వుడు అన్నారు. ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటూరని. దానికి కారణం.. గాంధీయేనని తెలిపారు.

mahatma gandhi is universal leader:cm kcr

గాంధీ జీవిత విశేషాలు, విగ్ర‌హాలు, విదేశాల్లో ఉన్నాయంటే ‌మన దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని కేసీఆర్ చెప్పారు.గాంధీ మార్గంలో దేశం అభివృద్ది సాధించాలని కోరారు. అహింస మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించామని గుర్తుచేశారు. స్వ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని చెప్పారు.

English summary
mahatma gandhi is universal leader cm kcr said. he attend at azadi ka amrut mahotsav closing ceremony at ld stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X