మహేశ్ బ్యాంక్ కేసు: ముగ్గురు అరెస్ట్.. షహనాజ్ సహా నైజీరియన్లు..
మహేష్ బ్యాంక్ సైబర్ మోసం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ నిధుల గోల్‌మాల్‌లో అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నైజీరియన్‌లతో పాటు ముంబైకి చెందిన షహనాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి నిధులను చోరీ చేసిన సంగతి తెలిసిందే. వీరే గాక ప్రధాన నిందితుడు ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతడు/ ఆమె కోసం పోలీసుల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 200 మంది ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి నగదు బదిలీ ఆయినట్లు గుర్తించారు. ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించారు. ఆ మేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.

మహేష్ బ్యాంకు అధికారులు, సర్వర్ నిర్వాహకులతోపాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. హ్యాకర్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్ వాడి సర్వర్ లోకి ప్రవేశించారు. ప్రాక్సీ ఐపీ అడ్రస్ ద్వారా మొదట సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు.
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి మరీ నగదును దోచుకున్నారు. బ్యాంకు అకౌంట్లలో గల రూ.12 కోట్లకు పైగా నగదును కాజేశారు. హ్యాక్ చేసిన సర్వర్ నుంచి 120 అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. బ్యాంకు మెయిన్ సర్వర్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు యాజమాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మరింత ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications