హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు మరో ఎస్సై.. మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సైపై ఫిర్యాదు, సస్పెండ్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నారు. నేరారోపణ ఎదుర్కొన్న వారిని కూడా కొట్టకుండా విచారిస్తారు. ఇదీ ఓకే.. కానీ కొందరు ఇన్‌స్పెక్టర్ తీరు మాత్రం మారడం లేదు. సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో తప్పుగా ప్రవర్తించన అంశం పోలీసు శాఖల పెను దుమారం రేపింది. ఇప్పుడు మరో ఇన్‌స్పెక్టర్ కూడా అలానే చేశాడు. ఇప్పుడు మల్కాజిగిరి వంతు వచ్చింది. దీంతో అతనిని కూడా వెంటనే విధుల నుంచి తప్పించారు.

ఇప్పుడు మరో ఎస్సైపై..

ఇప్పుడు మరో ఎస్సైపై..

మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐగా పని చేస్తున్న ధరావత్ విజయ్పై ఆరోపణలు వచ్చాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అతనిపై రేప్ కేసు నమోదైంది. తనతో కొంతకాలం సహజీవనం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనతో సహజీవనం చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలం తామిద్దరం హైదరాబాద్‌లో కలిసే ఉన్నామని బాధితురాలు తెలిపింది.

సహాజీవనం చేసి..

సహాజీవనం చేసి..


ఇప్పుడు తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్‌పై కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్‌ను రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. కేసుపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. గతంలో వనస్ధలిపురం పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా విజయ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇప్పుడు మరోసారి.. అదీ కూడా యువతి ఫిర్యాదు చేసింది.

ఉన్నతాధికారులు సీరియస్

ఉన్నతాధికారులు సీరియస్


నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. ఇప్పుడు విజయ్‌పై ఫిర్యాదు వచ్చింది. దీంతో అతనిని కూడా విధుల నుంచి తప్పించారు. కానీ పోలీసు శాఖకు మాత్రం చెడ్డ పేరు వస్తోంది. అవును ఒకరోజు గ్యాప్‌లో ఇద్దరిపై ఫిర్యాదులు రావడం.. సస్పెన్షన్‌ గురవడం కలకలం రేపింది. దీంతో ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా ఉన్నారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రూల్ ఆఫ్ లా అని.. అందరికీ ఓకే నియమాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

English summary
malkajgiri ccs si vijay suspended due to woman complaint to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X