హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్: ఓరేయ్ మధు ఏం పని ఇదీ, బీర్ల కోసం పోలీసులకు ఫోనా..?

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు పోలీసులకు కూడా విచిత్ర ఘటనలు ఎదురు అవుతూ ఉంటాయి. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కొందరు ఆకతాయిలు ఫోన్ చేస్తుంటారు. తాము ఆపదలో ఉన్నామని చెబుతుంటారు.. కానీ అక్కడికి వెళితే పరిస్థితి మరొలా ఉంటుంది. అవును అలాంటి ఘటనే వికారాబాద్ పోలీసులకు ఎదురయ్యింది. ఓ తాగుబోతు ఫోన్ చేసి రచ్చ చేశాడు. తీరా అక్కడికి వెళ్లి చూసి.. ఆశ్చర్యపోయారు.

అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్..

అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్..

ఇటీవల ఓ తాగుబోతు.. ఆ ఆకతాయి పేరు జనిగెల మధు.. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులకు ఫోన్ చేశాడు. డయల్ 100కి కాల్ చేశాడు. తనను కాపాడాలని.. ఎమర్జెన్సీ అని చెప్పాడు. కానీ అతను నటించాడు. తెలియక పోలీసులు అతని లోకేషన్ పట్టుకొని మరీ వెళ్లారు. ఆ సమయంలో కూడా వెళ్లి.. ఏం జరిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతని వద్దకెళ్లి చూసి నోరెళ్లబెట్టారు. అతని ఇంటికి వెళ్లగా.. అతను సరిగా ఉన్నాడు.

2 బీర్లు కావాలట..

2 బీర్లు కావాలట..

ఏమైందని పోలీసులు అడగగా.. తీరా విషయం చెప్పాడు. ఇప్పుడు సమయం 2 అవుతుందని.. వైన్ షాపులు బంద్ ఉంటాయని చెప్పారు. దీంతో వారికి కోపం నశాళానికి ఎక్కింది. తనకు రెండు బీర్లు కావాలని వారిని అడిగారు. ఏం చేయాలో.. ఏం చెప్పాలో తెలియలేదు. తమ సమయం వేస్ట్ చేశావు కదా అని మండిపడ్డారు. అంతేకాదు అతనిని అరెస్ట్ చేశారు. సమయం వేస్ట్ వేశావనే అభియోగం మోపారు.

మధు అరెస్ట్

మధు అరెస్ట్


నిజమే మధు లాంటి వారు మరొకరు కూడా ఫోన్ చేస్తే.. అసలు ఏదీ నిజం.. ఏదీ అబద్దం గుర్తించడం కష్టం అవనుంది. నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేసే వీలు ఉండదు. అందుకే చిన్న అభియోగం మోపి అదుపులోకి తీసుకున్నారు. మరొసారి ఇలా చేయొద్దు అని హెచ్చరించి వదిలేశాడు. అయినా మందు కావాలంటే..బ్లాకులో కొనాలీ కానీ.. ఏకంగా పోలీసులను అడగడం ఏంటీ అని కొందరు అంటున్నారు. ఇలాంటి ఆకతాయిల వల్ల నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం అందకుండా పోయే ప్రమాదం ఉంది. సో.. ఇలాంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.

English summary
Janigela Madhu dialled 100 around 2 am in an inebriated state and asked the police to save him from an emergency. when police come he asked 2 beers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X