"మా" పీఠం మంచు విష్ణుదే - ప్రకాశ్ రాజ్ ఓటమి : అన్ని విభాగాల్లోనూ విష్ణు ప్యానల్ ఆధిక్యత..!!
"మా" సమరంలో ఓటర్లు మంచుకే పట్టం కట్టారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. తనతో పాటుగా కీలక పదవుల్లో తన ప్యానెల్ సభ్యులను విష్ణు గెలిపించుకున్నారు. తొలి నుంచి వివాదాలు..వాగ్వాదాలు..విమర్శలు..వ్యక్తిగత ఆరోపణలతో సాగిన ఎన్నికల్లో అనూహ్యంగా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. సాయంత్రం నుంచి జరిగిన కౌంటింగ్ లో అన్ని విభాగాల్లోనూ విష్ణు ప్యానల్ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. ప్రకాశ్ రాజ్ తో పాటుగా ఆ ప్యానల్ లో కీలకంగా పని చేసిన జీవిత సైతతం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

మెగా క్యాంపు మద్దతుతో
మెగా క్యాంపు మద్దతుతో ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక, బరిలో దిగిన విష్ణుకు తండ్రి మోహన్ బాబు తొలి నుంచి అండగా నిలిచారు. అన్నీ తానై కుమారుడి విజయం కోసం శ్రమించారు. హీరో నరేశ్ సైతం విష్ణుకు మద్దతుగా నిలిచి విజయం కోసం పోరాడారు. విష్ణు ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు.. ట్రెజరర్ గా శివ బాలాజీ గెలుపొందారు. విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గెలవగా..ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు విజయం సాధించారు.

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా
ఇక, ఎన్నికల ముందు రోజు రాత్రి వరకు రెండు శిబిరాల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. పోలింగ్ ప్రారంభ సమయంలో అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరినీ మోహన్ బాబు దగ్గరకు తీసుకొచ్చారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పోలింగ్ గతం కంటే అధికంగా అనూహ్యంగా పెరిగింది. తొలుత ఎగ్జిక్యూటివ్ మెంబర్ల ఓట్ల కౌంటింగ్..ఆ తరువాత ఆఫీస్ బేరర్ల లెక్కింపు..చివరగా అధ్యక్ష బరిలో ఉన్న వారికి పడిన ఓట్లను లెక్కించారు. అధ్యక్ష బరిలో లెక్కింపు ప్రారంభం సమయం నుంచి విష్ణు ఆధిక్యత ప్రదర్శించారు.

ఎన్నికల్లో గెలుపొందిన ఆఫీస్ బేరర్లు..
"మా" ఎన్నికల్లో విష్ణు ప్యానల్ ఆధిక్యత సాధించింది. విష్ణుతో ప్యానల్ కు చెందిన అయిదుగురు ఆఫీస్ బేరర్స్ గా గెలుపొందారు. ఇక, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఇద్దరు గెలిచారు. పదవుల వారీగా చూస్తే.. అధ్యక్షడు- మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు-మాదాల రవి, ఉపాధ్యక్షుడు(2) గా -పృథ్వీ రాజ్, ప్రధాన కార్యదర్శి రఘుబాబు, ట్రెజరర్- శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీ -గౌతమ్ రాజు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ గా ఉత్తేజ్ గెలుపొందారు. విష్ణు ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేసిన బాబు మోహన్ పైన శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆఫీసు బేరర్లు.. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ స్పష్టంగా కనిపించింది. అయితే, ఇది చిరవకు ఎవరికి నష్టం చేస్తుందనే ఉత్కంఠ కొనసాగింది. అయితే, అధ్యక్ష పోటీలో మాత్రం విష్ణు వైపే మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన హేమ పైన విష్ణు ప్యానల్ సభ్యుడు పృథ్వీ రాజ్ గెలుపొందారు.

ఘాటుగా స్పందించిన చిరంజీవి
హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లిసందడి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మా ఎన్నికలను ఉద్దేశిస్తూ.. పదవులు తాత్కాలికమని, అల్లర్లతో 'మా' పరువు తీయొద్దని కోరారు. మన ప్రభావాన్ని చూపించడానికి వేరేవారిని కించపరచవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు. మనమంతా వసుధైక కుటుంబం అని చెప్పిన చిరు, ఇలాంటి ఘటనల వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని చెప్పుకొచ్చారు
Recommended Video
విష్ణు ఆధిక్యం 107 ఓట్లు..ఎమోషనల్ - ఓదార్చిన ప్రకాశ్ రాజ్
అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు 274 - విష్ణుకు 381 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల వెల్లడి సమయంలో విష్ణు ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ ఓదార్చారు. నరేశ్ తో పాటుగా ప్రకాశ్ రాజ్ విష్ణును ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు. మా మసకబారలేదని నరేశ్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అందరి సభ్యుల విజయంగా మోహన్ బాబు అభివర్ణించారు. అయిపోయిందేదో అయిపోయింది. అందరూ ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉందామని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్ తో సహా అందరి ఆశీస్సులు విష్ణుకు ఉండాలని మోహన్ బాబు కోరుకున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications