హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందిరం, మసీదు, చర్చ్: ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం.. అసెంబ్లీ తర్వాత శంకుస్థాపన..

|
Google Oneindia TeluguNews

కొత్త సచివాలయంలో మందిరం, మసీదు, చర్చ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం చేపడుతామన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు, సూచనలు కేసీఆర్ తీసుకున్నారు. పాత భవనాలు కూల్చివేస్తున్న సందర్భంలో మందిరం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందని కేసీఆర్ తెలిపారు.

 mandir mosques and churches in the new secretariat: kcr

మందిరం, మసీద్, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఇందులో అన్నీ వసతులు/ సౌకర్యాలు ఉంటాయని స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

Recommended Video

SR NTR's Lesson In School Education 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ పాఠ్యాంశం! || Oneindia

హైదరాబాద్ చుట్టూ ఖబ్రస్థాన్‌ రావాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం స్థలం సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. హైదరాబాద్‌లో వివిధ చోట్ల 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయమిచ్చి, విద్య అందించే.. అనీస్- ఉల్-గుర్భా నిర్మాణం వేగవంతం చేస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

English summary
mandir mosques and churches construct in the new secretariat cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X