Gold: ఫిలింనగర్‌లో భారీ చోరీ.. వజ్రలు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు..
హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్‌లోని ఫేజ్-2 ప్లాట్ నెంబర్ 26ఏలో శమంతక డైమండ్స్ ఎల్‌ఎల్‌పీ షోరూం నిర్వహిస్తున్నారు.ఈ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు షోరూం యజమాని నల్లబోతు పవన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కొన్నేళ్లుగా మాజీ మంత్రి నల్లబోతు చెంచురామయ్య మనువడు పవన్‌కుమార్ వజ్రాభరణాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
పవన్‌కుమార్ వజ్రాభరణాలు తయారు చేయించి కస్టమర్లకు అందిస్తుండేవారు.ఈ మధ్యే వీరి షో రూంను మాదాపూర్ నుంచి ఫిలింనగర్ వెంచర్-2కు మార్చారు. డిసెంబర్ 20న రాత్రి ఉద్యోగి కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోగా.. మరసటి రోజు ఉదయం షాప్ తెరిచి చూడగా షోరూంలో క్యాబిన్లు, డ్రాలు తెరిచి ఉన్నాయి. వెంటనే వాటిని పరిశీలించగా కబోర్డ్‌లో ఉండాల్సిన ఆభరణాలు కనబడలేదు. దీంతో వెంటనే యజమానికి ఈ విషయాన్ని చెప్పాడు. చోరీ జరిగినట్లు నల్లబోతు పవన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

200 క్యారెట్ల డైమండ్లు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, కిలో గోల్డ్ సెట్ హారం, నాలుగు ఉంగరాలు చోరీకి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షో రూంకు చేరుకుని ఆధారాలు సేకరించారు. షాపు వెనుకాల కిటికీ గ్రిల్ తొలగించి దొంగలు లోనికి ప్రవేశించి ఆభరణాలను సంచుల్లో వేసుకుని అదే దారి నుంచి బయటికి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
నెంబర్ ప్లేట్ లేని యాక్టీవాపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మంకీ క్యాప్‌లు ధరించి లోపలికి వెళ్లడమే కాకుండా ఓ బ్యాగ్‌లో ఆభరణాలు పెట్టుకుని సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుచేజీల్లో కనిపించింది. ఈ మేరకు పోలీసులు విచాణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications