• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Niharika Wedding:పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?స్టెప్పులతో ఇరగదీసిన చిరు..వీడియో వైరల్

|

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని హాట్‌టాపిక్స్‌లో ఒకటిగా నిలిచింది మెగా డాటర్ వెడ్డింగ్. అవును మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా పెళ్లి వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ వెన్యూకు చేరుకుని సందడి చేసేస్తోంది. మొత్తానికి చివరిగా కూతురు వివాహానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ చేరుకుని ఆ కిక్కే వేరప్పా అని అనిపించారు. ఆట పాటలతో ఉదయ్ పూర్ ప్యాలెస్ సందడిగా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు, కాబోయే వధూవరులు వేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  #NiharikaKonidelaWedding : All Mega Heroes In one Frame | Pawan Kalyan| Sangeeth | Viral

  సంగీత్‌లో మెగా ఫ్యామిలీ

  మెగా ఫ్యామిలీలో మరో గ్రాండ్ ఈవెంట్‌కు సమయం దగ్గర పడింది. నిహారిక పెళ్లి కోసం అంతా ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అక్కడే మెగా ఫ్యామిలీ మొత్తం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సంగీత్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నాగబాబుతో పాటు ఆయన వియ్యంకుడు కూడా డాన్స్ వేశారు. అయితే ఈ సంగీత్‌ వేడుకల్లో అన్ని మెగాస్టార్ నటించిన సినిమా పాటలు మాత్రమే ప్లే కావడం కొసమెరుపు.

  బాబాయ్ పవన్ గిఫ్ట్ ఏంటో తెలుసా

  బాబాయ్ పవన్ గిఫ్ట్ ఏంటో తెలుసా

  ఇక నీహారికా వెడ్డింగ్‌ను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలన్న ఆలోచన సోదరుడు వరుణ్ తేజ్‌దే అని సమాచారం. ఇక చెల్లి పెళ్లి ఏర్పాట్లు అన్నీ చాలా దగ్గరగా ఉండి వరుణ్ తేజ్ చూసుకున్నారు. ఇదంతా ఒకలా ఉంటే అసలు పెళ్లికి బాబాయ్ పవన్ కళ్యాణ్ వస్తారా లేదా అనేది చాలామంది మెగా అభిమానుల్లో ఎక్కడో చిన్న సందేహం ఉండేది. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు చేరుకున్నారు. పవన్ ఉదయ్ పూర్ ప్యాలెస్‌కు చేరుకోవడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ మరింత వెలుగు వచ్చినట్లు అయ్యింది. పవన్ కళ్యాణ్ కూతురు నీహారికకు బహుమతిగా కోటి రూపాయలు విలువ చేసే నగలు బహుమతిగా ఇచ్చారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

  భార్యతో కలిసి డాన్స్ వేసిన చిరు

  ఇక మగధీరలోని చిరంజీవి రీమేక్ సాంగ్ బంగారు కోడిపెట్టకు మెగాస్టార్ అదే గ్రేస్‌తో వేసిన స్టెప్పులు అదరగొట్టాయి. సతీమణి సురేఖ కూడా చిరంజీవితో లెగ్ షేక్ చేశారు. ఇలా మొత్తానికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. వరుడు చైతన్యతో కలిసి నీహారిక వేసిన డ్యాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు టాప్ స్టార్లు అతిథిగా వస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరెవరు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వెళుతున్నారో అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. రానివారి కోసం హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలి.

  English summary
  A video from Mega daughters wedding where Chiranjeevi was seen dancing is making rounds on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X