Hyderabad: ట్యాంక్ బాండ్ వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లు పక్కకు నెట్టిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ..!

హైదరాబాద్ లోని ట్యాంక్ బాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ట్యాంక్ బాండ్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం నిషేధం విధించారు. ఇందుకు సంబంధించి ట్యాంక్ బాండ్​ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బాండ్ వద్దకు చేరుకుని సైన్ బోర్డులను తొలగించారు. బారికేడ్లను పక్కకు నెట్టారు. గణేష్ విగ్రహాలన హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేశారు.

హుస్సేన్ సాగర్ లో ఎప్పటి నుంచో గణనాథుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నామని కమిటీ సభ్యులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా విగ్రహాలను హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయ్యొద్దని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022లో, 2023లో కూడా ఇదే విధంగా చెప్పారని, కానీ చివరకు ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనాలు జరిగాయని తెలిపారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాన్ని అడ్డుకుంటే ఆందోళన తప్పదని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. అయితే గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Members of the Bhagyanagar Utsava Committee expressed their anger over the immersion of Vinayaka idols

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని పేర్కొంది. ఇక ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్​ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ భక్తుల ఒత్తిడితో హుస్సేన్ సాగర్ లోనే ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని మామిడి వేణుమాధవ్ ఆరోపిస్తున్నారు.

దీనిపై ఆయన హైకోర్టు కూడా వెళ్లారు. కాగా నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ సమన్వయంతో పని చేస్తోంది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+