Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ఎండకాలం మీకు చుక్కలే..!
హైదరాబాద్ వాసులపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండి పోతున్నాయి. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత మూడేళ్లలో ఫిబ్రవరిలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 2021లో 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది.
ఫిబ్రవరిలో దాదాపు మూడుసార్లు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ నిన్న విడుదల చేసిన నివేదిక ప్రకారం నగరంలో గురువారం గరిష్టంగా ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా ఫిబ్రవరిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది.

ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, హైదరాబాద్‌లో ఈ సంవత్సరం కఠినమైన వేసవి కాలం ఉండనుంది. ఎల్‌నినో దీనికి కారణంగా చెబుతున్నారు. ఎల్ నినో వేసవిలో ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా వర్షపాతం, పంటల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలం అసాధారణంగా వేడెక్కడానికి దారితీసే వాతావరణ నమూనా వాతావరణ శాఖ చెబుతోంది.దీని వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది.












Click it and Unblock the Notifications