హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో ట్రాఫిక్... ప్రతి రోజు అదనంగా 50వేల మంది : ఎన్వీఎస్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

గత పదహారు రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తుండడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే...అయితే హైదరాబాద్ కూడ ఇదే కొనసాగుతోంది. ఆర్టీసీ 40 శాతంమేర మాత్రమే బస్సులు నడుపుతోంది. దీంతో హైదరబాద్ ప్రయాణికులు మెట్రో ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సమ్మె కారణంగా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. సాధరణ రోజులకంటే అదనంగా ప్రతిరోజు 50వేల మంది ప్రయాణిస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో మెట్రోతో ప్రయాణికులు ఊరట పోందుతున్న విషయం తెలిసిందే..దీంతో సమ్మె నేపథ్యంలోనే సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వం ఆదేశాలతో హైదరాబాద్ మెట్రో అధికారులు అదనపు ఏర్పాట్లు చేసింది. ఇందుకు అనుగుణంగా మరో యాబై వేల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నారు. సాధరణంగా ప్రతి రోజు మూడు లక్షల మంది మెట్రో రైల్లో ప్రయాణిస్తుండంగా సమ్మె కారణంగా మరో 50 వేల మంది అదనంగా ప్రయాణిస్తున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు.

Metro traffic ... 50 thousand passengers an additional every day in metro

కాగా సమ్మె నేపథ్యంలోనే ఉదయం అయిదున్నరకే ప్రారంభమవుతున్న మెట్రో రాత్రి పన్నెండు గంటలకు వరకు కూడ కొనసాగుతోంది. దీంతోపాటు గతంలో ప్రతి అయిదు నిమిషాలకో మెట్రో నడుపుతున్న మెట్రో అధికారులు సమ్మె కారణంగా ప్రతి మూడు నిమిషాలకు ఒక మెట్రోను నడుపుతున్నారు.

English summary
Metro passengers have risen due to the RTC strike. Metro MD NVS Reddy said more than 50 thousand passengers were traveling on normal days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X