12న మిలియన్ మార్చ్.. ఈటల విజయం తథ్యం: బండి సంజయ్
హుజూరాబాద్ బై పోల్‌లో సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రుపాయలు ఖర్చు చేసిన కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు త్వరలోనే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఈవీఎంలు మార్చాలని చూసినా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని, కేసీఆర్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నాడన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచినా ఓట్లు మాత్రం బీజేపీకే వేశారని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు సంభవిస్తాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.ఇటు ఏపీలో పవన్ కల్యాణ్ ఫైర్ అవుతుండగా.. తెలంగాణలో బీజేపీ మరింత ఫామ్ అవుతోంది. బండి సంజయ్ కామెంట్లను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఇటు రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నామని బండి సంయ్ తెలిపారు . ఇక ఇదే అంశంపై సోమవారం తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో మాట్లాడనున్నారు బండి సంజయ్. మిలియన్ మార్చ్‌పై వారికి దిశానిద్దేశం చేయనున్నారు.
Recommended Video
నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ పాదయాత్ర సందర్బంగా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాడు బండి సంజయ్. దీపావళి లోపు నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే మిలియన్ మార్చ్‌కి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ బీజేపీకి మరింత హైప్ ఇవ్వనుంది. తొలి నుంచి కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. విధానపర అంశాల్లో జరిగి తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఈ సారి విజయం తమదేనని.. అలాగే పోరుబాట పడుతున్నామని తెలియజేశారు.












Click it and Unblock the Notifications