హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Sharmila New Party: పుట్టగతులు ఉండవు, మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అంతా ఊహించినట్టే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ సీపీ టీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. దీనిని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. షర్మిలకు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉంటే ఏపీలో పార్టీ ఏర్పాటు చేయాలని కోరేవారు ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కూడా స్పందించారు

ఇతర పార్టీలకు స్థానం లేదు

ఇతర పార్టీలకు స్థానం లేదు

తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు పుట్టగతులు ఉండవని గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశం లేదని చెప్పారు. వేరే పార్టీలు ఏర్పాటు కావని.. వచ్చిన బతకి బట్టకట్టవని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడవవని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో అందరినీ కలుపుకొని పోతామని.. ధిక్కార స్వరం లేదని చెప్పారు. కానీ కొందరు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైరయ్యారు.

గంగుల రియాక్షన్

గంగుల రియాక్షన్


షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనపై గంగుల స్పందించారు. అంతకుముందే సీఎం కేసీఆర్ కూడా రియాక్టయ్యారు. ఊహాగానాలపై కేసీఆర్ స్పందిస్తూ..కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? అని కేసీఆర్ అన్నారు. అంతేకాదు అలే నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా అని కేసీఆర్ గుర్తుచేశారు. నాలుగు రోజుల్లోన తోక ముడుస్తారని.. ఎటూకాకుండా తెరమరుగై పోతారని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పార్టీ..

టీఆర్ఎస్ పార్టీ..

టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని కేసీఆర్ అన్నారు. కానీ వైసీపీ కూడా బతికి బట్టకట్టింది. పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారం కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఏపీలో వైసీపీ ప్రభావం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం లేదు. దీంతో కేసీఆర్ కామెంట్ చేయడం.. మంత్రి గంగుల కమలాకర్ కూడా విరుచుకుపడ్డారు.

English summary
telangana minister gangula kamalakar reacts on ys sharmila new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X