హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనూషకు అండగా మంత్రి కేటీఆర్: వైద్య విద్య కోసం ఆర్థిక సాయం

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా పరిస్థితులు.. చదువు అంతంతమాత్రమే.. ఉన్నత చదువుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినప్పటికీ కొందరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ప్రొఫెషనల్ కోర్సుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా అనూష కూడా హైయర్ స్టడీస్ చదువుతుంది. అదీ కూడా ఎంబీబీఎస్.. కానీ మూడేళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చారు. నాలుగో ఏడాదికి వచ్చేసరికి చేతిలో డబ్బులు లేవు. విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ సాయం చేస్తానని.. ఇబ్బంది పడొద్దని భరోసా ఇచ్చారు.

 మెడిసిన్..

మెడిసిన్..

హైదరాబాద్‌ బోరబండకు చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కరోనా నేపథ్యంలో చదువు కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. మళ్లీ ఎడ్యుకేషన్ రీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

గిరిజన కుటుంబం..

గిరిజన కుటుంబం..

అనూష.. గిరిజన కుటుంబానికి చెందిన వారు. ఆమె తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వైద్య విద్య కోర్సు ఫీజులు ఇక భరించే స్థితిలో లేరు. అనూష ఫీజు కోసం ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. పేదరిక పరిస్థితుల నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూషకి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇక దిగులు చెందొద్దు అని భరోసానిచ్చారు.

నేనున్నా..

నేనున్నా..

అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశరు. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్నానని స్పష్టంచేశారు. అనూషకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. ఆమెకు అన్నివిధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కి ఆమె కుటుంబం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.

Recommended Video

గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
అడిగితే సాయం

అడిగితే సాయం

ఇప్పుడే కాదు విద్య, వైద్యం కోసం సాయం కావాలని అడిగితే చాలు మంత్రి కేటీఆర్ స్పందిస్తారు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. స్పందించి తగిన చర్యలను తీసుకుంటారు. ఇప్పటివరకు చాలా మందికి సాయం చేశారు. కేటీఆర్ చొరవతో తమకు మేలు జరిగిందని చాలామంది తెలియజేశారు. ఆ జాబితాలో అనూష కూడా చేరబోతున్నారు. ఆపన్నులకు మంత్రి కేటీఆర్ అభయహస్తంలా మారుతున్నారు. సాయం కావాలని కోరితే చాలు.. స్పందిస్తున్నారు.

English summary
telangana minister ktr helps poor medical student anusha complete her mbbs studying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X