హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. శ్రావణి, సాంగ్ సూపర్.. కేటీఆర్ ఇంప్రెస్.. దేవిశ్రీ, తమన్ కూడా.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

ప్రతీ ఒక్కరికీ ప్రతిభ ఉంటుంది. దానిని వెలికితీయాలి అంతే.. ఇప్పుడు చాలా ఈజీ.. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినందున.. ఏ విషయమైనా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇక ట్విట్టర్‌లో అయితే క్షణాల్లో ప్రపంచంలో జరిగిన/ జరుగుతున్న విషయాలు తెలుస్తాయి. అలా ఓ పల్లెకు చెందిన చిన్నారి.. పాడిన పాట ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావం ఏర్పాటు గురించి పాడిన పాట అలరిస్తోంది. రేలారే రేలారే.. నీళ్లల్లో నిప్పల్లో అంటూ ఆ చిన్నారి పాడిన పాట అద్భుతంగా ఉంది.

కేటీఆర్ ఇంప్రెస్..


చిన్నారి పాట మంత్రి కేటీఆర్‌ను ఇంప్రెస్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, ఎస్ ఎస్ తమన్ పాటకు ముగ్ధులయ్యారు. అదేంటో మనం చుద్దాం పదండి. మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి పాడిన జానపద గేయం వారినీ కట్టిపడేసింది. సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి ఆమె పాటను వీడియో తీసి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీంతో ప్రపంచానికి శ్రావణి ప్రతిభ తెలిసింది. అమ్మాయి పేరు శ్రావణి. తండ్రి పేరు లక్ష్మణ చారి. ఊరు మెదక్ జిల్లాలోని నారైంగి. ఓ పనికోసం ఊరికెళ్తే ఈ ఆణిముత్యాన్ని చూశాను. చాలా బాగా పాడుతోంది. ఆమె గాత్రం అద్భుతం. ఈ ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు మీ మద్దతు, ఆశీర్వాదం కావాలని పేర్కొంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

వావ్.. వాట్ ఏ టాలెంటెడ్..

వావ్.. వాట్ ఏ టాలెంటెడ్..

పాట విన్న కేటీఆర్.. 'నిజంగా టాలెంటెడ్' అంటూ తమన్, దేవిశ్రీలను ట్యాగ్ చేశారు. వారు కూడా ఆ పాటను విన్నారు. నిజంగా ట్యాలెంట్ అద్భుతమంటూ దేవిశ్రీ ట్వీట్ చేశారు. ఇంత మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిని తమకు పరిచయం చేసినందుకు థాంక్యూ అంటూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇప్పటికే ప్రపంచం చూడని ఇలాంటి వాళ్లకోసమే వెతుకుతున్నానని, కచ్చితంగా శ్రావణికి అవకాశాలిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ టు రాక్ స్టార్‌లో ఆమెతో పాడిస్తానని, ఆమె ప్రతిభను అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. 'ఆమె బంగారం' అంటూ తమన్ ట్వీట్ చేశారు.

జానపద గేయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. జరుగుతోన్న అభివృద్ది తన జానపద గేయంలో శ్రావణి చక్కగా వివరించారు. తన గాత్రంతో ఆ జానపదం పాడి వన్నె తీసుకొచ్చారు. ఈమెకు అవకాశం కల్పిస్తే.. మనకు మంచి నేపథ్య గాయనీ దొరికినట్టు అవుతారు. మంత్రి కేటీఆర్ సూచనతో దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఛాన్స్ ఇస్తామని చెప్పడం సానుకూల అంశంగా మారింది.

English summary
telangana minister ktr impressed sravani folk song and give a chance to her. he asked music directors devisri prasad, thaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X