హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. కేసీఆర్ సర్కార్ పేరెత్తడంతో జనాగ్రహాం

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే.. నేతలకు పరాభావం తప్పదు. అవును చాలా సందర్భాల్లో మనం చూశాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే లేవు. ఘట్ కేసర్ వద్ద రెడ్ల సింహ గర్జన నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి సభకు హాజరయ్యారు. మాట్లాడే క్రమంలో ప్రభుత్వం, కేసీఆర్ గురించి కామెంట్ చేశారు. ఇంకేముంది అక్కడున్న వారికి చిర్రెత్తుకు వచ్చింది.

ఘట్‌కేసర్‌ 'రెడ్ల సింహ గర్జన' సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం కేసీఆర్‌ను పొగుడుతుండగా మంత్రి మల్లారెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందనడంతో మండిపడ్డారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ పేరెత్తడంతో చెప్పులు, రాళ్ళు విసిరేశారు. దీంతో మంత్రి మల్లారెడ్డి మధ్యలోనే ప్రసంగం ఆపేసి వెళ్లిపోయారు. మల్లారెడ్డి వెళ్తున్న సమయంలో కూడా కాన్వాయ్‌పై బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకుని కారుపై కుర్చీలతో దాడి చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 30 సెకన్ల నిడివి గల వీడియో చక్కర్లు కొడుతుంది. ప్రభుత్వ పెద్దలు వ్యతిరేకత లేదని చెబుతున్నారు. కానీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పుడే వ్యతిరేకత కనిపిస్తోంది. మరీ దీనికి ప్రభుత్వ పెద్దలు/ టీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందో చూడాలీ మరీ.

minister mallareddy get agitation at reddla simhagarjana

సభకు వచ్చిన వారిలో కొందరు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు.. మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మల్లారెడ్డి సభకు వచ్చినప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగానే ఉంది. మంత్రి సభా వేదికపైకి ఎక్కి మైకు పట్టుకుని స్పీచ్‌ అందుకున్నారో.. అంతే.. ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా మంత్రి తమ సామాజికవర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడతారని ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగిందని.. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతే ఆ ఒక్కమాటతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పదే పదే కేసీఆర్, టీఆర్‌ఎస్ గొప్పల గురించే మాట్లాడుతున్నారని మంత్రి ప్రసంగానికి రెడ్లు అడ్డుపడ్డారు.

English summary
minister mallareddy get agitation at reddla simhagarjana. than he goes to home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X