పువ్వాడ నయన్: సినిమానా, పాలిటిక్సా.. చిరు, తారక్, రామన్నతో భేటీ, కారణమిదే..
పువ్వాడ నయన్ రాజ్.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడు. ప్రొఫెషన్ రీత్యా వైద్యుడు.. కానీ అతనికి సినిమాలు అన్న, రాజకీయాలు అన్న ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ అతని బర్త్ డే. మంత్రి కుమారుడు బర్త్ డే రోజున.. ఫ్యామిలీ లేదంటే.. దోస్తులతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నయన్ రాజ్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా జరుపుకున్నారు. సినీతారలు చిరంజీవి, ఎన్టీఆర్‌ను విడివిడిగా కలిసి.. మరీ కేక్ కోశారు. తర్వాత మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు.

ఎన్టీఆర్..
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని కలిశారు. పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. నయన్.. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అభిమాని తెలుస్తోంది. అందుకే కుమారుడి బర్త్ డే సందర్భంగా అతడిని జూనియర్ వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

చిరంజీవి..
ఇటు మెగాస్టార్ చిరంజీవిని కూడా పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంత్రి పువ్వాడ సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలను కలవడం ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. పువ్వాడ నయన్ ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవికి నయన్ అభిమాని అయి ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

కేటీఆర్
మంత్రి కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజయ్ కుమార్, నయన్ కలిశారు. 'డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అని పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Recommended Video

మనసులో ఏముందో..
పైకి చూస్తే ఇదీ జనరల్ మీట్‌లా ఉన్న.. లోన ఏదో కొడుతుంది. కుమారుడిని సినీ తెర మీదనా.. లేదంటే రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications