మనసున్న మంత్రి సబితా.. యూ టర్న్ తీసుకొని సాటి మహిళతో మాటామంతీ

పైన బుగ్గ కారు.. లోన ఏసీ పెట్టుకొని రయ్ మనీ వెళుతుంటారు మంత్రులు. రోడ్డుపై ఉన్నవారిని పట్టించుకోవడం చాలా అరుదు. అలా పలకరించారో వారికి సాటి మనషులపై ప్రేమ, అభిమానం ఉన్నట్టే. కొన్ని సందర్భాల్లో ఆమాత్యులు తమ మనసును చాటుకున్నారు. ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంచి మనసు కూడా బయటపడింది. రోడ్డుపై ఉన్న ఓ మహిళను పలకరించారు.

రోడ్డు పక్కన ఎండలో అచేతనంగా పడి ఉన్న ఓ మహిళను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమె వివరాలు కూడా ఆరా తీశారు. ఎండల నుంచి వెళ్లాలని కోరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్‌పల్లి మండల పర్యటనకు శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి వెళ్తున్నారు. మార్గమధ్యలో లంగర్‌హౌస్‌ టిప్పుఖాన్‌పూల్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని గమనించారు.

telangana minister sabitha indra reddy interact women at hyderabad

తన కాన్వాయ్‌ ఆపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కానీ అప్పటికే కాన్వాయ్‌ ముందుకు వెళ్లిపోయింది. డివైడర్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని మరీ తిరిగి వచ్చింది. కారు దిగిన మంత్రి మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు మాటలు రావని సైగలతో చెప్పింది. ఆమెకు నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు. మంత్రి సబితా మంచి మనసును పలువురు ప్రశంసిస్తున్నారు. సామాన్యులు సైతం పట్టించుకోని, మాటలు రానీ మహిళ పట్ల ఆమె చూపిన కరుణను కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+