హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా స్టోరీని మించిన మైనర్ల ఫేస్‌బుక్‌ లవ్: ఎంతదాకా వెళ్లిందో తెలిస్తే షాక్ అవుతారు!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫేస్ బుక్ వేదికగా పరిచయమైన ఇద్దరు మైనర్ల ప్రేమ కథ సినిమా కథను మించిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న వారిద్దరూ, మళ్లీ తల్లిదండ్రులు విడదీయడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో పరిచయం అయిన మైనర్లు.. స్నేహం ఆపై ప్రేమ

సోషల్ మీడియాలో పరిచయం అయిన మైనర్లు.. స్నేహం ఆపై ప్రేమ


సోషల్ మీడియా.. జనాలకు ఉపయోగపడడం కంటే, మానవ జీవితంపై ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు యువత బాగా అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారితో ప్రేమలో పడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక ఇదే క్రమంలో తాజాగా నేరేడ్‌మెట్‌ కు చెందిన శ్రీకాంత్, రాజేంద్ర నగర్ కు చెందిన నిఖిత ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. మొదట స్నేహితుడుగా పరిచయం అయిన వీరి స్నేహం రెండేళ్ల తర్వాత ప్రేమగా మారింది.

జూన్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్న జంట.. మైనర్లని విడదీసిన తల్లిదండ్రులు

జూన్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్న జంట.. మైనర్లని విడదీసిన తల్లిదండ్రులు

ఆపై ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని భావించి, ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు అని తెలిసి ఈ సంవత్సరం జూన్ నెలలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక నిఖిత పెళ్లి చేసుకోవడంతో పెళ్లి గురించి తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తె మైనర్ అని, శ్రీకాంత్ చేసుకున్న పెళ్లి చెల్లదని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్ ఇంటికి వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరినీ మైనర్ల ని గుర్తించి, నిఖితను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న యువతి, తాను లేకుండా బ్రతకలేనని యువకుడు ఆత్మహత్య

మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న యువతి, తాను లేకుండా బ్రతకలేనని యువకుడు ఆత్మహత్య

ఇక తమ ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడం, తల్లిదండ్రులు నిఖితను మందలించడం, శ్రీకాంత్ నుండి దూరంగా నిఖితను తీసుకువెళ్లడంతో తీవ్ర మనోవేదనకు గురైన నిఖిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీన రాజేంద్రనగర్లో ఉరి వేసుకుని నిఖిత మరణించింది. ఇక నిఖిత మరణవార్త తెలిసిన శ్రీకాంత్ కుమిలిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్, ఆమె లేని లోకంలో తాను ఉండలేనని అమ్ముగూడా రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఫేస్ బుక్ ప్రేమ

రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఫేస్ బుక్ ప్రేమ

ఇక ఈ కేసులో తప్పు ఎవరిదైనా, దీనంతటికీ ప్రధాన కారణం సోషల్ మీడియా, ఫేస్ బుక్ పరిచయం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరూ మైనర్లు అని తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీ, యువకులు, తల్లిదండ్రులు మందలించారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారడమే కాకుండా, సదరు మైనర్ల జీవితంలోనూ ఇబ్బందికర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి.

English summary
Minors Facebook love went to the point of their secret marriage. Then the elders separated the minors and both committed suicide, which became a tragedy in Neredmet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X