మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం: యువకుడి వేధింపులే కారణమా?

హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఉరివేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సమయానికి స్పందించిన పోలీసులు యువతిని కాపాడారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి ఓ యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..

మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..

ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే... హాసిని అనే యువతి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‎నగర్ రోడ్ నెంబర్ 6లో ఓ అపార్ట్‎మెంట్‎లోని ఫ్లాట్‎లో నివాసం ఉంటోంది. హాసిని 2018లో మిస్ తెలంగాణకు ఎంపిక కావడం గమనార్హం. కాగా, హాసిని గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని ఆన్‎లైన్‎లో పోస్టు చేసింది. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే స్పందించిన పోలీసులు.. యువతి ప్రాణాలు కాపాడారు

వెంటనే స్పందించిన పోలీసులు.. యువతి ప్రాణాలు కాపాడారు


హుటాహుటిన యువతి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమెను కాపాడారు. యువతిని వెంటనే హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని.. హాసిని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్‎స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హాసిని ఆత్మహత్యాయత్నం చేయడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దారుణం: డబ్బు కోసం మామ హత్య

హైదరాబాద్‌లో దారుణం: డబ్బు కోసం మామ హత్య

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్‌లో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి సొంత మామనే హత్య చేశాడు. రియల్‌ఎస్టేట్‌ బిజినెస్‌లో కమీషన్‌ ఇవ్వలేదని కొడవలితో సొంత మామనే నరికి చంపాడు అల్లుడు.రియల్టర్ రవీందర్‌రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో బుధవారం తన అల్లుడు మోహన్‌రెడ్డి దాడి చేశాడు. ప్లాట్ కొనుగోలులో 6 లక్షల రూపాయల కమీషన్ విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో మోహన్‌రెడ్డి తన మామపై కొడవలితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీందర్‌రెడ్డి గురువారం ఉదయం మృతి చెందాడు. నిందితుడు మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విషాదం: చెరువులో పడి ముగ్గురు యువతులు మృతి

విషాదం: చెరువులో పడి ముగ్గురు యువతులు మృతి

జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. జగిత్యాల పట్టణంలోని గాంధీ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతుల మృతిచెందారు. ఇందులో ఇద్దరికి వివాహం కాగా, ఇంకో యువతి ఇంటర్ చదువుతోంది. మరణించిన వారిలో ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలను బయటికి తీశారు.. మరో యువతి వందన మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. యువతుల మృతి ఘటనపై కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+