హైదరాబాద్‌లో ఇంటర్ యువతి అదృశ్యం: 5రోజులకు గుంటూరులో ప్రత్యక్షం, ఆమె వెంట యువకుడు
హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్ హాస్టల్ నుంచి నవంబర్ 27న అదృశ్యమైన మౌనిక అనే యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని, తాను హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిపెట్టి వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రియుడి మోజులో పడి.. భర్తా, పిల్లలకు విషంపెట్టింది, రాత్రిరాత్రే లేచిపోయింది!

ఆత్మహత్య చేసుకుంటానంటూ..
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన మౌనిక హిమాయత్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. నారాయణగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది. హిమాయత్‌నగర్ నుంచి రోజూ కాలేజీకి వెళ్లే తనను ఓ యువకుడు వేధిస్తున్నాడని, వేధింపులు భరించలేకపోతున్నానని.. అందుకే తాను హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మౌనిక లేఖ రాసి కనిపించకుండా పోయింది.

సిటీ అంతటా గాలింపు..
ఆ లేఖను చూసిన ఇతర విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎంజీరోడ్ మినిస్టర్ రోడ్, బేగంపేట ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే వారికి ఎలాంటి క్లూ దొరకలేదు.

గుంటూరులో యువతి, ఆమె వెంట యువకుడు
కుటుంబసభ్యులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు గుంటూరులో కూడా గాలింపు చేపట్టారు. ఆదివారం ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. మౌనికను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ సమయంలో ఆమెతోపాటు ఓ యువకుడు కూడా ఉన్నాడు. దీంతో ఆమెతోపాటు అతడ్ని కూడా హైదరాబాద్ తీసుకువస్తున్నారు.

ఐదు రోజులపాటు..
మౌనికతోపాటు ఉన్న యువకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. అతడి కోసమే ఆమె హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లిందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదు రోజులపాటు అటు పోలీసులకు, ఇటు కుటుంబసభ్యులను ఉరుకులు పరుగులు పెట్టించిన మౌనిక ఆచూకీ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో కొంత ఆందోళనకర వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!