కళంకితుల పార్టీ కమలం, కేసీఆర్ ఫ్యామిలీపై చిల్లర ఆరోపణలు: బాల్క సుమన్

ఢిల్లీ లిక్కర్ అవకతవకల అంశం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం కూడా ఉందనే కామెంట్ల నేపథ్యంలో రగడ కొనసాగుతోంది. బీజేపీ నేతల కామెంట్లకు..టీఆర్ఎస్ పార్టీ అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. నిన్న కవిత ఇంటిని బీజేవైఎం ముట్టడించిన సంగతి తెలిసిందే. వారి తీరును టీఆర్ఎస్ నేతలు ఖండించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇవాళ టీఆర్ఎస్పీలో మీడియాతో మాట్లాడారు.

చిల్లర ఆరోపణలు

చిల్లర ఆరోపణలు

సీఎం కేసీఆర్‌పై కుటుంబంపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తోందని బాలక్క సమున్ అన్నారు. వారు చేసే నీచాతి నీచ వ్యాఖ్యలను జనం చూస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసులకు అదరం బెదరం అని చెప్పారు. ఏ విషయంలోనైనా.. కాంప్రమైజ్ అయ్యే నైజం కేసీఆర్‌ది కాదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ మనస్తత్వం అలాంటిది అయి ఉంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదే కాదని చెప్పారు.

కాసులకు ఆశపడం..

కాసులకు ఆశపడం..

తమ పార్టీ ఒక స్పష్టమైన అంశంతో ముందుకు వచ్చిందని సుమన్ గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం తమ ఎజెండా అని.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ది అని సెలవిచ్చారు. కాసులకు ఆశపడే పార్టీ తమది కాదని పేర్కొన్నారు. అవీ ఏ పార్టీలో అందిరికీ తెలుసు అని చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి అసలే లేదని చెప్పారు. కమలం పార్టే కళంకితుల పార్టీ అని చెప్పారు.

రోడ్లపై తిరగరు

రోడ్లపై తిరగరు

ఇటు బీజేవైఎం తీరును మంత్రి సత్యవతి రాథొడ్ ఖండించారు. తాము తలచుకుంటే బీజేపీ నేతలు రోడ్లపైకి రారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇళ్లు ముట్టడించడం సరికాదని అన్నారు. ఎందుకు ఆమె ఇంటిని ముట్టడించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+