మహిళ దర్బార్ కాదు రాజకీయ దర్బార్, ఫక్తు బీజేపీదీ.. జగ్గారెడ్డి, వివేకానంద విమర్శలు
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మహిళా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి టీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా ఫైరయ్యారు. అదీ ఫక్తు బీజేపీ నేతృత్వంలోనే జరిగిందని చెప్పారు. బీజేపీ, ప్రధాని డైరెక్షన్‌లోనే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ జరిగిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మతవిద్వేషాలతో ఓట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు రాజాసింగ్ లాంటి వ్యక్తులను ఎందుకు కట్టడి చేయట్లేదని అడిగారు. రాజాసింగ్, హిందువులు ఆజ్మీర్ దర్గాకు వెళ్లకుండా అడ్డుకోగలరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్‌పై మండిపడ్డారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదని..అది పూర్తిగా పొలిటికల్ దర్బార్ అని కామెంట్ చేశారు. రాజ్యాంగ పదవులను తాము గౌరవిస్తాం అని అంటూనే గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటినా కూడా తాము సహనంతోనే ఉంటున్నామని తెలిపారు.

ప్రజా దర్భార్ ను కొనసాగించి తీరుతాను అంటూ గవర్నర్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అందిన ఫిర్యాదులను పరిశీలిస్తానని..సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తమిళి సై అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ అన్నారు.రాజ్‌భవన్‌ను గౌరవించాలని కూడా ఆమె ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే తాము ముందుగా మహిళా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళలకు అండగా ఉండాలనే మహిళా దర్బార్ నిర్వహిస్తున్నామని, అంతేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications