హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 గంటల ఫుటేజీ, అందరికీ వీడియోలు.. బీజేపీపై కేసీఆర్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. వీడియో ఫుటేజీ 3 గంటలు ఉందని చెప్పారు. వాటిని ఇప్పటికే హైకోర్టుకు అందజేశామని పేర్కొన్నారు. వీడియోను సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలు, ఎన్నికల సంఘానికి, అన్నీ రాష్ట్రాల డీజీపీకు పంపించామని తెలిపారు. ఈ రోజు తాను బాధతో మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఈ దేశంలో ఏం జరుగుతోంది.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నారు.

24 మంది ముఠా

24 మంది ముఠా

మఠాధిపతుల రూపంలో జరుగుతోన్న పనులను తప్పుపట్టారు. పైలట్ రోహిత్ రెడ్డితో రామచంద్రా భారతి చర్చలు జరిపారని పేర్కొన్నారు. 24 మంది ముఠా ఉన్నారని గుర్తుచేశారు. బీజేపీ అన్నీ రంగాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. దుర్మార్గాన్ని ఉపేక్షించొద్దు అని.. నాకేం అవుతుందిలే అనుకంటే మనకే ఇబ్బంది అన్నారు. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే.. అన్నీ చూసుకుంటాం.. ఈడీ, ఐటీ రాదు.. సెక్యూరిటీ కల్పిస్తామని చెబుతున్నారని తెలిపారు. రాజ్యాంగేతర శక్తుల్లో భారత ప్రభుత్వం ఉందని కేసీఆర్ తెలిపారు. దీనిని అరికట్టాలని.. లేదంటే అందరికీ ప్రమాదమేనని వివరించారు.

ఇందిరాగాంధీ ఇలా..

ఇందిరాగాంధీ ఇలా..

బంగ్లాదేశ్ మీద విజయం తర్వాత ఇందిరా గాంధీకి తిరుగులేదని అనుకున్నాం.. కానీ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభ కోల్పోయింది. అలానే బీజేపీకి కూడా అలా జరుగుతుందన్నారు. ఆ తర్వాత జయ ప్రకాశ్ నారాయణ్ వచ్చి ఉద్యమించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావాలని అన్నారు. ఆ రోజున లక్షలాది మందిని జైలులో నిర్బంధించారని గుర్తుచేశారు. మాలవీయా, పాశ్వాన్ లాంటి నేతలు జైలు నుంచి పోటీ చేసి గెలుపొందారని తెలిపారు.

దీదీతో మోడీ

దేశంలో అరాచక కాండ, కిరాతకమైన రాజకీయం, జుగుప్పకరమైన రాజకీయం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ.. దీదీ మీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెబుతారా అని కేసీఆర్ అడిగారు. ఏక్‌నాథ్ షిండే సృష్టిస్తాం అని ఎలా చెబుతారు అని అడిగారు. కేంద్ర హోం మంత్రి వచ్చి.. నెలరోజుల్లో ప్రభుత్వం కూల్చివేస్తాం అని చెబుతారా అని అడిగారు. దేశ ప్రజా, యువత, మీడియా.. ముక్తకంఠంతో ఖండించకపోతే.. అందరం పోతాం అన్నారు. ఈ దమనకాండ, హననం కావాలని అన్నారు. దేశం దెబ్బతింటే.. వంద ఏళ్లు వెనక్కి వెళతాం అన్నారు.

English summary
mla proach issue: 3 hours footage send to supreme court, ec, cms cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X