స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం, ఏర్పాట్లు పూర్తి.. టీఆర్ఎస్‌ను వెంటాడుతున్న భయం..
ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,326 ఓటర్లు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

బ్యాలెట్ పద్దతిలో
ఎన్నికను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సెంటర్లలోకి సెల్‌ఫోన్ల అనుమతి ఉండదు. సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేపట్టనున్నారు. అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నారు.

5 జిల్లాల నుంచి 6 సీట్లకు
స్థానిక సంస్థల కోటా కింద 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ ఓటర్లు గోవా క్యాంపు నుంచి హైదరాబాద్ బయలు దేరారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రంకు వెళ్లనున్నారు. అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం కలవరం పెడుతోంది. టీఆర్ఎస్ కున్న మొత్తం ఓట్లలో 100 నుంచి 150 వరకు క్రాస్ అవుతాయని ప్రచారం జరుగుతోంది.
Recommended Video

ప్రజా ప్రతినిధులే ఓటర్లు
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. రాష్ట్రంలో మొతం 12 స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ కాగా.. నాలుగు జిల్లాల పరిధిలో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన ఆరు స్థానాలకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ అనివార్యం అయ్యింది. ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సమీక్ష నిర్వహించారు. పోలీసు భద్రతతో పాటు పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో పాటు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో అదనంగా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications