హైదరాబాద్ ఔటర్ చుట్టూ మరో మణిహారంగా ‘ఎంఎంటీఎస్’: రూ. 40కే చుట్టేయచ్చు!

హైదరాబాద్: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు మణిహారంగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడుగా ఇప్పుడు ఎంఎంటీఎస్ మరింతగా విస్తరించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు వాహనాల వేగం పెరిగింది. ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండనుంది.

హైదరబాద్ ఔటర్ చుట్టూ 150 కి.మీ మేర ఎంఎంటీఎస్

హైదరబాద్ ఔటర్ చుట్టూ 150 కి.మీ మేర ఎంఎంటీఎస్

ఇప్పటికు నగరంలోనే పలు మార్గాల్లో సేవలందిస్తున్న ఎంఎంటీఎస్.. ఇప్పుడు ఔటర్ చుట్టూ కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైలు వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంలో ప్రయాణికులు ఎక్కువగా మెట్రోను ఉపయోగిస్తున్నప్పటికీ.. ఎంఎంటీఎస్ ప్రయాణికులు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్‌ను ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 150 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఇందుకు హైదరాబాద్ మహానగర్ అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది.

రూ. 40కే ఎంఎంటీఎస్ ద్వారా హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టేయచ్చు!

రూ. 40కే ఎంఎంటీఎస్ ద్వారా హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టేయచ్చు!

అంతా అనుకున్నట్లు జరిగి ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే ప్రజా రవాణా మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, ఎంఎంటీఎస్ టిక్కెట్ ధరలను బట్టి కేవలం రూ. 40లకే ఔటర్ చుట్టూ ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఔటర్ ఎంఎంటీఎస్ కోసం రైల్వే లైన్లు నిర్మించేందుకు స్థలాన్ని కూడా కేటాయించింది.

రూ. 1500 కోట్లతో ఓఆర్ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ రైల్వే లైన్

రూ. 1500 కోట్లతో ఓఆర్ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ రైల్వే లైన్

ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక కిలోమీటరు రైల్వే లైను నిర్మాణానికి రూ. 10 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా 150 కిలోమీటర్లకు రూ. 1500 కోట్లతో రైల్వే నిర్మాణం పూర్తవుతుంది. ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్లు కోసం రూ. 1500 కోట్లు కేటాయించడంతోపాటు స్టేషన్లు, రైళ్లకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎంఎంటీఎస్‌తో హైదరాబాద్ ఔటర్ నలువైపులా విస్తరణ

ఎంఎంటీఎస్‌తో హైదరాబాద్ ఔటర్ నలువైపులా విస్తరణ

ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా నగరం విస్తరిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. కొందరు ఫాంహౌస్ లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. రిసార్టులు వెలుస్తున్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకునేవారు ఇప్పుడు ఓఆర్ఆర్ వైపే చూస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ ఔటర్ చుట్టూ వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నగర విస్తరణ నలుమూలాల మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరం నలువైపులా అంటే పశ్చిమంలో తెల్లాపూర్, తూర్పున ఘట్ కేసర్, ఉత్తరాన మేడ్చల్, దక్షిణాన ఉందానగర్ వరకూ ఎంఎంటీఎస్ విస్తరించనుంది. ప్రజా రవాణా మరింత మెరుగుపడనుంది.ఈ ప్రతిపాదనలు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+