హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవమానాలు ఎదురైన చోటే అందలం.. ఫిక్సింగ్, మాఫియా నుంచి ‘హెచ్‌సీఏ’ వరకు అజారుద్దీన్

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలు రకాలుగా అవమానాల పాలైన ఈ హైదరాబాదీ క్రికెట్ తనపై పడిన మచ్చను తడిపేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రీడలపై దృష్టిపెడుతూనే అజహర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికై ఎక్కడైతే అవమానాల పాలయ్యాడో.. అక్కడే ఆదరణను సంపాదించుకోవడంతో ఇక అజహర్‌కు మంచి రోజులు వచ్చాయనే మాట క్రీడా, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇక వివరాల్లోకి వెళితే..

2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో

2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో

భారత జట్టుకు పలు విజయాలు అందించి ఉత్తమ కెప్టెన్‌గా క్రీడాభిమానులచే ఆదరణ పొందుతున్న నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఒక్కసారిగా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాడు. దాంతో భారత క్రికెట్ రంగమే కాకుండా ప్రపంచ క్రికెట్ నివ్వెరపాటు గురైంది. ఆ సమయంలో అజహర్‌పై సరైన రీతిలో దర్యాప్తు సాగలేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది.

బుకీలు, పంటర్లు, అండర్ వరల్డ్ నుంచి

బుకీలు, పంటర్లు, అండర్ వరల్డ్ నుంచి

అప్పట్లో హైకోర్టు తీర్పుకు సీబీఐ సమాధానం ఇస్తూ.. అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా అన్ని రకాల సాక్ష్యాలు పొందుపరిచాం. బుకీలు, పంటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా మ్యాచ్‌ను ఫిక్స్ చేయమని అండర్ వరల్డ్‌తో సంప్రదింపులు జరిగాయి అని పేర్కొన్నది.

అవమానించిన బీసీసీఐ

అవమానించిన బీసీసీఐ

అయితే అజహర్ బ్యాన్ చట్ట వ్యతిరేకం అని కోర్టు పేర్కొన్నది. అయినా బీసీసీఐ చాలా కాలం పాటు అతనికి చెల్లించాల్సిన మొత్తాన్ని, వన్ టైమ్ బెనిఫిట్ చెక్, పెన్షన్ తదితర అంశాలపై నిరాసక్తతను ప్రదర్శించింది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో బీసీసీఐ తన పంథాను మార్చుకొన్నది. 2016 నుంచి ఆయనకు ఆహ్వానాలు పంపుతూ వచ్చింది. అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపడం ప్రారంభించడంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సానుకూలత పెరిగింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా

తాజాగా జరిగిన హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఎన్నికలు జరుగగా మొత్తం 223 ఓట్లు పోలయ్యాయి. అజారుద్దీన్‌కు ఏకంగా 147 ఓట్లు రాగా, ప్రకాశ్ చంద్ జైన్‌కు 73 ఓట్లు, దిలీప్ కుమార్‌కు మూడు ఓట్లు లభించాయి. దాంతో తనపై పడిన ఫిక్సింగ్ మచ్చను తడిపేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లు అయింది.

 అజహర్‌కు చేదు అనుభవాలు

అజహర్‌కు చేదు అనుభవాలు

గత ఎన్నికల్లో హెచ్‌సీఏ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. నిషేధం ఉందనే ఆరోపణలను చూపుతూ టెక్నికల్ కారణాలపై అజారుద్దీన్ నామినేషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాలన యంత్రాంగంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే అక్కడ భంగపాటు కలిగింది. ప్రస్తుతం అలాంటి అవమానాలు ఎదుర్కొన్న చోటనే మళ్లీ విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించుకొన్నాడు.

అజారుద్దీన్ కెరీర్

అజారుద్దీన్ కెరీర్

అజారుద్దీన్ తన కెరీర్‌లో మొత్తం 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. 1992, 1996, 1999 సంవత్సరాల్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు ప్రాతినిథ్యం వహించారు. కెరీర్‌లో 22 టెస్ట్ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికాలో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఆయనకు చివరిది. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్‌లో కూరుకుపోవడంతో క్రికెట్‌కు దూరమయ్యాడు.

English summary
Indian Cricketer, former MP, Congress leader Mohammed Azharuddin elected as Hyderabad Cricket Association president. He is now, come into limelight with positive energy. After lift of the ban from BCCI, he has been stepped into main streem sports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X