హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇలాంటి సీఎంను చూడలేదు: కేసీఆర్‌ను ఆకాశానికెత్తిన మోత్కుపల్లి నర్సింహులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు, మాజీ మోత్కుపల్లి నర్సింహుల్.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడని, పేద ప్రజలను ఆదుకునే నాయకుడని.. ప్రస్తుతం ఉన్నది అలాంటి నాయకుడు కేసీఆరేనని అన్నారు.

ఇలాంటి సీఎంను చూడలేదంటూ కేసీఆర్‌పై మోత్కుపల్లి

ఇలాంటి సీఎంను చూడలేదంటూ కేసీఆర్‌పై మోత్కుపల్లి


సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లి నర్సింహాలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇవాళ సంతోషకరమైన దినం. ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రిలను చూశా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ని చూడలేదన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు దళిత బంధు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు.

ఆ ఘనత కేసీఆర్‌దేనంటూ మోత్కుపల్లి ప్రశంసలు

ఆ ఘనత కేసీఆర్‌దేనంటూ మోత్కుపల్లి ప్రశంసలు

రైతులకు అప్పుల బాధ లేకుండా రైతును రాజు చేసేందుకు రైతు బంధు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. రైతులకు ఒక్కరికే కాదు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. పేదలకు అండగా ఉన్న వ్యక్తి కేసీఆర్. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి సమక్షంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి నర్సింహులు అనంతరం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మోత్కుపల్లి రాజకీయాలకతీతంగా సన్నిహితుడంటూ కేసీఆర్

మోత్కుపల్లి రాజకీయాలకతీతంగా సన్నిహితుడంటూ కేసీఆర్

కాగా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని, రాజకీయాలకు అతీతంగా ఆయన తనకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్నారు. స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. ప్ర‌జా జీవితంలో ఆయనకు ఒక స్థానం ఉందని చెప్పారు. విద్యార్థి ద‌శ తర్వాత మోత్కుపల్లి నర్సింహులు క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే కాకుండా అణ‌గారిన ప్ర‌జల తన గొంతు వినిపించారని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. తనతో అనేక సంవ‌త్స‌రాలు క‌లిసి ప‌ని చేశారు. ఆయన వెంట ఎంతో అభిమానంతో వ‌చ్చిన వారంద‌రికీ హృద‌య‌పూర్వ‌క‌మైన స్వాగ‌తం తెలుపుతున్నానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Spl coverage on Mothkupally comments on Dalit Bandhu
అప్పుడు అనేక భయాలు కల్పించారన్న సీఎం కేసీఆర్

అప్పుడు అనేక భయాలు కల్పించారన్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర స‌మాజం అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను అనుభవించిందన్నారు సీఎం కేసీఆర్. ఒక‌ప్పుడు న‌ర్సింహులు క‌రెంట్ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌ను క‌లిసిన‌ప్పుడు క‌రెంట్ బాధ‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఎన్ని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేసినట్టు కేసీఆర్ తెలిపారు. క‌రెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో క‌ష్టాలు పడిందన్నారు.
సోష‌ల్ వెల్ఫేర్ మినిస్ట‌ర్‌గా మోత్కుపల్లి సేవలందించారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అనేక భయాలు కల్పించారన్నారు. తెలంగాణ వస్తే అభివృద్ధి ఉండదన్నారని తెలిపారు. తెలంగాణ కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతినే 13సార్లు కలిశానని కేసీఆర్ చెప్పారు. అన్నింటిని ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. మోత్కుపల్లి నర్సింహులు సేవలు వినియోగించుకుంటామన్నారు కేసీఆర్.

English summary
Motkupalli Narasimhulu praises Telangana CM KCR in Telangana Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X