ఆ పార్టీ పట్టించుకోవడం లేదు.. అందుకే జాతీయ పార్టీ: ఎమ్మెల్యే రేగా కాంతారావు
దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. దసరా రోజున పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన ఉండనుంది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కామెంట్ చేశారు. ఇవాళ పార్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసిన తర్వాత.. కాంతారావు ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో పలు సమస్యలు ఉన్నాయని.. కానీ అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోవడం లేదని రేగా కాంతా రావు అన్నారు. అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని చెప్పారు. ఈ నెల 5వ తేదీన జరిగే సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధులు తీర్మానం చేస్తాం అన్నారు.

యువత, రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. గురుతరమైన బాధ్యత వహించాలి అనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు కదిలారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
తెలంగాణ భవన్ లో దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తానారు. డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మునుగోడులో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications