you are great modi:విద్యా విధానం భేష్, రాములమ్మ విజయశాంతి ప్రశంసలు
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాదు.. కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా ప్రశంసిస్తారు. మంచి కూడా జనానికి చెప్పాలని రాములమ్మ విజయశాంతి అంటున్నారు. నూతన విద్యా విధానంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశంలో ఇప్పటివరకు ఉన్న విద్యా విధానం బాధ్యత గల పౌరులను తయారు చేయడంలో విఫలమైందని తెలిపారు. మోడీ సర్కారు ఈ పరిస్థితుల్ని తిరగరాస్తోందని పేర్కొన్నారు.
వివేకం లేని యంత్రాలేనా..?
మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వైద్య విద్యలో రిజర్వేషన్లు కల్పించడం శుభపరిణామం అని ఆమె ట్వీట్ చేశారు. దశాబ్దాల నుంచి దేశంలో అమలవుతున్న విద్యావిధానం వివేకం లేని యంత్రాలు లాంటి ఉద్యోగులనే ఎక్కువగా సృష్టించిందే తప్ప.. నాయకత్వ లక్షణాలు గల బాధ్యతగల పౌరులను తయారు చేయలేదన్నారు. ఈ పరిస్థితులను తిరగరాస్తూ ప్రధాని మోడీ నాయకత్వంలో సర్కారు గత ఏడాది నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.

గుడ్ న్యూస్..
నూతన వ్యవస్థ అన్ని వర్గాలకూ లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యుఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం మంచి విషయం అని విజయశాంతి అన్నారు. కరోనా వైరస్ లాంటి విపత్తులు విలయతాండవం చేస్తున్న తరుణంలో... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇవ్వాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ముందు చూపునకు నిదర్శనం అని ప్రశంసించారు.
Recommended Video

ప్రాంతీయ భాషల్లో బోధన
ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అందించాలనే నిర్ణయం.. దేశ భాషలకు కొత్త ఊపిరిపోస్తూ భావితరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందించనుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. బధిర లిపిని ఇతర భాషల విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వీలు కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ఆ ప్రత్యేక అవసరాలు గలపౌరుల పట్ల మన ప్రధాని మోడీ సమాన దృష్టి వహింరాచరని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకుని.. బాధ్యత గల రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని రాములమ్మ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications