బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డు - రూ 24.60 లక్షలతో: ఎవరికి దక్కిందంటే..!!
గణేష్ నిమజ్జనం నాడు అందరూ బాలాపూర్ వైపే చూస్తారు. బాలాపూర్ లడ్డూ వేలంకు ఉండ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతీ ఏడాదికి వేలం ధర పెరుగుతోంది. ఈ ఏడాది అదే జరిగింది. రికార్డు స్థాయిలో ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలంలో రూ 24.60 లక్షలు పలికింది. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి వేలం లో ఈ లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈ సారి రూ 5.70 లక్షల అధికంగా ధర పలికింది. బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాటబాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాటలో 9 మంది పోటీ పడ్డారు.
లడ్డూ కోసం పోటీ పడిన వారిలో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు వేలంలో పాల్గొన్నారు. చివరకు రికార్డు ధరకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది 2021లో జరిగిన వేలంలో ఏకంగా 18 లక్షల 90 వేలు పలికింది. మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ వేలంలో లడ్డూ సొంతం చేసుకున్నారు. ఏపీలోని కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ ఈ సారి వేలం వద్దకు వచ్చారు. ఉదయం నుంచి బాలాపూర్ గణేష్ విగ్రహం వద్ద సందడి నెలకొని ఉంది. తీన్మార్ బ్యాండ్ తో గ్రామస్థులు..సందడిగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో గణేషుడిని ఊరేగింది..బొడ్రాయి సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. మంత్రులు.. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో లడ్డూ వేలం వేసారు.

9 రోజులపాటు విశేష పూజలందుకున్న బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతోంది. బాలపూర్ టు ట్యాంక్ బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను సమీక్షించిన పోలీసు అధికారులు.. ఎక్కడా ఎలాంటి అవాంతరం కలుగకుండా సాఫీగా యాత్ర సాగడానికి చర్యలు చేపట్టారు. సాయంత్రం బాలాపూర్ గణేష్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది. కాగా, లడ్డూ దక్కించుకున్న లక్ష్యా రెడ్డి తాను 23 ఏళ్లుగా సమితి సభ్యుడిగా ఉన్నా ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని.. ఈ సారి తనకు ఆ గణేషుడి లడ్డూ దక్కించుకొనే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications