తెలంగాణలో కరోనా కాటుకు ఇప్పటిదాకా ఎంతమంది బలి అయ్యారో తెలుసా? కేసులు కాస్త తగ్గినా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అదే వేగం కొనసాగుతోంది. ఇదివరకటి రోజువారీ పాజిటివ్స్‌తో పోల్చుకుంటే.. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిందంతే. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో స్థిరత్వం కొనసాగుతూనే వస్తోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి కోలుకున్న పేషెంట్ల సంఖ్య కూడా క్రమంగా మెరుగు పడుతోంది. డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒకవంక భారీ వర్షాలు ముంచెత్తుతున్నప్పటికీ.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది.

కొత్తగా 1,967 కరోనా కేసులు..

కొత్తగా 1,967 కరోనా కేసులు..

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,967 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. 2,058 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,85,833కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,54,499గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1100లకు చేరుకుంది. మొత్తం 30,234 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 24,607 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

1100లకు చేరుకున్న కరోనా మరణాలు..

1100లకు చేరుకున్న కరోనా మరణాలు..

ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్నట్లుగా కరోనా మరణాలు తెలంగాణలో లేవు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేషెంట్లు.. కరోనా బారిన పడి మరణిస్తున్నారు. తెలంగాణలో ఆ స్థాయిలో మరణాలు నమోదు చోటు చేసుకోకపోవడం ఊరట కలిగించే అంశమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందటం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా 1100 మంది మరణించారని, మరణాల రేటును నియంత్రించడంలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహం ఫలిస్తోందని అంటున్నారు. రోజూ 10కి కాస్త అటు, ఇటుగా కరోనా మరణాలు నమోదవుతున్నాయని అధికారులు తమ బులెటిన్ల ద్వారా వెల్లడిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో అదే తీరు..

గ్రేటర్ హైదరాబాద్‌లో అదే తీరు..

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24 గంటల్లో 297 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-17, భద్రాద్రి కొత్తగూడెం-91, జగిత్యాల-56, జనగామ-24, జయశంకర్ భూపాలపల్లి-20, జోగుళాంబ గద్వాల-19, కామారెడ్డి-56, కరీంనగర్-152, ఖమ్మం-78, కొమరంభీమ్ ఆసిఫాబాద్-15, మహబూబ్ నగర్-25, మహబూబాబాద్-66, మంచిర్యాల-33, మెదక్-24, మేడ్చల్ మల్కాజ్‌గిరి-137, ములుగు-34, నాగర్ కర్నూలు-27, నల్లగొండ-105, నారాయణపేట్-8, నిర్మల్-26, నిజామాబాద్-61, పెద్దపల్లి-40, రాజన్న సిరిసిల్ల-44, రంగారెడ్డి-147, సంగారెడ్డి-54, సిద్ధిపేట్-70, సూర్యాపేట్-46, వికారాబాాద్-18, వనపర్తి-25, వరంగల్ రూరల్-26, వరంగల్ అర్బన్-89, యాదాద్రి భువనగిరి-37 కేసులు నమోదు అయ్యాయి.

50 వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు..

50 వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు..

మరోవంక- తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు ముంచెత్తుతున్నప్పటికీ.. వాతావరణం సహకరించకపోయినప్పటికీ.. ఫ్రంట్‌లైన్ వారియర్లు తమ విధులను నిర్వరిస్తున్నారు. 24 గంటల్లో కొత్తగా 50,108 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 28,50,869కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 76,,788 టెస్టులను నిర్వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+