Disha case విచారణ: పోలీసులను ప్రశ్నిస్తున్న ఎన్‌హెచ్ఆర్సీ, అంశాల ఆధారంగా నివేదిక
రెవెన్యూ అధికారు ఎంక్వైరీలో
దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు అకాడమీలో పోలీసులు రెవెన్యూ అధికారులను బృందం ప్రశ్నించనుంది. దీంతో ఎన్‌కౌంటర్‌కి సంబంధించి విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడుగురు సభ్యుల బృందం.. ఎన్‌హెచ్ఆర్సీకి నివేదిక సమర్పిస్తే.. వాటి నివేదిక ఆధారంగా నోటీసులు జారీచేస్తారు.

తొలిరోజు ఇలా..
దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత శనివారం ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చారు. తొలుత మహబూబ్‌నగర్‌లో భద్రపరిచిన మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలను పరిశీలించారు. అక్కడే ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టానికి సంబంధించి సీడీ తీసుకొని.. వైద్యులను కూడా పోస్టుమార్టం గురించి అడిగారు. ఆ రోజు రాత్రి ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని పరిశీలించారు.

రెండోరోజు
మరునాడు పోలీసు అకాడమీలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి, దిశ సోదరిని ప్రశ్నించారు. దిశ ఎప్పుడూ ఫోన్ చేశారు. ఏం చెప్పారు. ఆడియో సంభాషణల గురించి అడిగారు. తర్వాత నిందితుల బంధువులను కూడా ప్రశ్నించారు. వారి వాదనను రికార్డ్ చేశారు. అంతకుముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను పరామర్శించి, ప్రశ్నించారు. ఎన్‌హెచ్ఆర్సీ బృందం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

నేటితో పూర్తి..
సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. ఎన్‌కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఎన్నిగంటల సమయంలో అక్కడికి వెళ్లారు అనే అంశాలపై పోలీసులను గుచ్చి గుచ్చి అడుగుతారు. చటాన్ పల్లి రెవెన్యూ సిబ్బందిపై కూడా పలు అంశాలపై ఆరాతీస్తారు. ఎన్ కౌంటర్ జరిగాక పంచనామా చేసిన వారిని.. మృతదేహాలు ఎలా పడి ఉండేవి, రక్తపు మరకులు ఉండేవా.. తదితర అంశాలపై ప్రశ్నిస్తారు. వారు చెప్పే అంశాల ఆధారంగా నివేదిక పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరో పిటిషన్
దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. వాస్తవానికి ఉదయం 10.30 గంటలకు విచారించాల్సి ఉన్నా, మరో పిటిషన్ దాఖలు కావడంతో రెండు కలిపి ఓకేసారి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు విచారణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఆధారంగా పాలమూరు ఆస్పత్రిలో ఉన్న నిందితల మృతదేహాల అంత్యక్రియలు ఆధారపడి ఉన్నాయి. శుక్రవారం జరగాల్సిన అంత్యక్రియలు హైకోర్టు, ఎన్‌హెచ్ఆర్సీ బృందం పర్యటనతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications