ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనం
దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్‌తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్‌లో ములాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను అరెస్ట్ కూడా చేసింది. అయితే నగరంలో గల ఉగ్రవాదుల ఉన్న ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఐఈడీ తయారీలో ఉపయోగించేపేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాసిర్ మాలిక్ ఇంట్లో ఎన్‌ఐఏ నిన్న సోదాలు నిర్వహించింది.
బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్‌లో బాంబు దాడి జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనకు హైదరాబాద్‌కు లింకు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించి కేసు నమోదు చేసింది. నిందితులను అరెస్టు చేసి విచారించగా... ఐఎస్‌ఐ ఉగ్రదాడికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తేలింది. జూన్ 17 జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఎ తీగలాగితే...డొంక కదిలింది.

హైదరాబాద్ మల్లేపల్లిలో ఉంటున్న ఇద్దరు లష్కర్ తోయిబాకు చెందిన ఇమ్రాన్ మాలిక్, సోదరుడు మహ్మద్ నాజిర్ మాలిక్‌ను అరెస్టు చేసింది. వీరిద్దరి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని షామిలి జిల్లాలోని కైరానా అని గుర్తించారు. మల్లేపల్లిలో ఉంటున్న వారి నివాసం నుండి సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసం నుండి పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. గతంలో మరో ఇద్దరు హీజ సలీమ్, కఫీల్‌ను యాపి యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఎకు అప్పగించారు.
నాజిర్ మాలిక్ హైదరాబాద్‌లో 20 ఏళ్ల నుండి ఓ బట్టల దుకాణం నడుతుండగా.. గతంలో పాకిస్తాన్ వెళ్లి పేలుడు పదార్ధాలను తయారీ చేయడంలో ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి మల్లేపల్లిలో ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తేలింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు కలిగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. పాక్ ముష్కర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల ప్రకారం వీరు ఐఇడి బాంబును వారి బట్టలతో కలిపి ఉంచి పార్సిల్ చేశారు. దీనిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దర్బాంగాకు తరలించారు. అది కనుక రైలులో పేలి ఉంటే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications