రెడ్ ట్యాగ్ మోగకుండా జాగ్రత్త.. మహేశ్ బ్యాంక్ దోపిడీ కేసులో కేటుగాళ్ల ప్రికాషన్స్

మహేశ్ బ్యాంక్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.13 కోట్ల చోరీని సైబర్ క్రైమ్ పోలీసులు రివీల్ చేశారు. నిందితులకు సహకరించింది నైజిరీయన్ అని.. అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. పారిపోగా.. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. బ్యాంకుకు చెందిన నగదు తొలుత 4 ఖాతాల్లోకి బదిలీ అయ్యింది. అక్కడి నుంచి నిందితులు మరో 128 ఖాతాల్లోకి ట్రాన్సఫర్ చేశారు. ప్రధాన నిందితులతోపాటు ఆ ఖాతాదారుల కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.

 దళారుల ద్వారా

దళారుల ద్వారా

పట్టుబడిన ఖాతాదారులను ప్రాథమిక విచారణ చేయగా.. కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో గాలింపు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరూ దొరకక పోయినా ఢిల్లీ వెళ్ళిన పోలీసులకు మాత్రం ముగ్గురు ఖాతాదారులతోపాటు దళారిగా వ్యవహరించిన ఒక నైజీరియన్‌ను గుర్తించారు.

పోలీసులపై దాడి..

పోలీసులపై దాడి..

నిన్న మధ్యాహ్నం అతని ఫ్లాట్ వద్దకు చేరుకోగా.. పోలీసులపై పిడిగుద్దులు గుద్దుతూ వారినుంచి తప్పించుకుని ఢిల్లీ రోడ్లలో పరుగులు తీశాడు. వీధుల్లో ఛేజింగ్ చేసి దాదాపు 2 కిలోమీటర్లు వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన పోలీసు బృందాలు మరి కొంందరు ఖాతాదారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తోపాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్‌ టీమ్‌ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితను అరెస్టు చేసింది. ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ కోసం కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇలా హ్యాక్ చేశారు..

ఇలా హ్యాక్ చేశారు..

మహేష్ బ్యాంకు ఖాతాలను పక్కా ప్లాన్‌తోనే నైజీరియన్లు హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హ్యాకింగ్ సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండా నైజీరియన్లు జాగ్రత్త పడ్డారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అవుతే ఆర్బీఐ‌తోపాటు ఐటీ శాఖకు రెడ్ ట్యాగ్ అలారం మోగుతుంది. రెడ్ టాగ్ మోగితే హాకింగ్ గురించి వెంటనే ఆర్బీఐకు సమాచారం వెళ్తుంది. అయితే రెడ్ ట్యాగ్ మోగకుండా నైజీరియన్లు జాగ్రత్తపడ్డారు. వ్యాపారవేత్తల కరెంట్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకుని, రెడ్ ట్యాగ్ వెళ్లకుండా నైజీరియన్లు బ్లూ ప్రింట్ ప్లాన్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు కనుగొన్నారు. బదిలీ చేసుకున్న నగదును 128 ఖాతాల్లోకి తక్కువ మొత్తంలో మోసగాళ్లు మళ్లించారు. మోసగాళ్లు మళ్ళించిన 128 ఖాతాల యజమానులకు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికీ పది మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నైజీరియన్లు కోసం పోలీసు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+