హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహం సింగిల్‌గానే.. 150 చోట్ల పోటీ, బీజేపీపై కేటీఆర్ నిప్పులు..

|
Google Oneindia TeluguNews

గ్రేటర్‌లో ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 150 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఇప్పటికే 125 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంఐఎంతో టీఆర్ఎస్ సన్నిహితంగా ఉంటోంది. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం సింగిల్‌గా పోటీ చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐతో పొత్తు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెదిన మహిళ అభ్యర్థి మేయర్ అవుతారని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ పాతబస్తీలో 5 సీట్లు గెలిచిందని గుర్తుచేశారు. అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామని కేటీఆర్ చెప్పారు.

no alliance with mim party in the ghmc elections: ktr

ఎల్ఎఆర్ఎస్‌లో కేంద్రం జోక్యం ఉండబోదు అని స్పష్టంచేశారు. ఆస్తిపన్నును అన్ని మున్సిపాలిటీల్లో తగ్గించామని వివరించారు. ధరణి పోర్టల్‌తో ఇప్పటికే కోటి మంది లబ్ధిపొందారని తెలిపారు. వర్షం పడుతున్న సమయంలోనే వరద సాయం ప్రారంభించామని తెలిపారు. మీ సేవా సెంటర్ల వద్ద జనాల క్యూ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్ చుట్టు పక్కల రెండు లక్షల మందికి సాయం చేశామని చెప్పారు. అందరీకి వరద సాయం చేస్తామని.. వివక్షకు తావులేదని చెప్పారు. కర్ణాటక, గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని.. తెలంగాణపై మాత్రం నిర్లక్ష్యం చూపించిందని కేటీఆర్ అన్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.

English summary
no alliance with mim party in the ghmc elections trs working president ktr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X